iDreamPost
android-app
ios-app

ఈ స్టార్ నటిని గుర్తు పట్టారా? బుల్లితెర- వెండితరె మీద ఒక వెలుగు వెలిగింది!

Guess This Famous Anchor- Serial Artist: మీరు చాలామంది సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫొటోలు, చిన్ననాటి జ్ఞాపకాలు చూసే ఉంటారు. కానీ, ఈ ఫేమస్ యాంకర్, సీరియల్ నటి, సినిమా నటిని ఎప్పుడైనా చూశారా? అసలు ఆ ఫొటోలో ఉన్న ఫేమస్ యాంకర్, నటి ఎవరో గుర్తు పట్టారా?

Guess This Famous Anchor- Serial Artist: మీరు చాలామంది సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫొటోలు, చిన్ననాటి జ్ఞాపకాలు చూసే ఉంటారు. కానీ, ఈ ఫేమస్ యాంకర్, సీరియల్ నటి, సినిమా నటిని ఎప్పుడైనా చూశారా? అసలు ఆ ఫొటోలో ఉన్న ఫేమస్ యాంకర్, నటి ఎవరో గుర్తు పట్టారా?

ఈ స్టార్ నటిని గుర్తు పట్టారా? బుల్లితెర- వెండితరె మీద ఒక వెలుగు వెలిగింది!

కొందరు నేరుగా వెండితెర మీదకు వచ్చి అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. కానీ, కొందరు మాత్రం తాము మొదలు పెట్టిన ప్రయాణానికి.. సాధించిన విజయాలకు అస్సలు పొంతన ఉండదు. ఎక్కడో మొదలై ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అంతేకాదు.. కొన్ని లక్షల, కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన ఒక యాంకర్, నటి, డ్యాన్సర్, సెలబ్రిటీ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ సెలబ్రిటీ గురించి దాదాపుగా తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఆమె సీరియల్స్ చేసింది. ఒక యాంకర్ గా చేసింది. యాక్టర్ గా వెండితెర మీద పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరో గుర్తుపట్టారా?

సాధారణంగా సెలబ్రిటీ అయిపోగానే.. చాలామంది మాట, తీరు, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. కానీ, ఈమె మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డౌన్ ఎర్త్ అనే స్వభావంతోనే మెలిగుతోంది. నేను సీరియల్స్ చేశాను, నేను స్టార్ యాంకర్ ని, నేను ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించాను అనే గర్వం మాత్రం ఎక్కడా ఉండదు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఈమె అంటే తెలుగు ప్రేక్షకులకు ఎనలేని అభిమానం. ఎవరైనా కోరుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం సమాజంతో పోరాడతారు. కానీ, ఈమె మాత్రం సొతం వారితోనే పోరాటం చేయాల్సి వచ్చింది. తనకు నచ్చిన డ్యాన్స్ నేర్చుకునేందుకు ఎవరికీ తెలియకుండా దొంగతనంగా నేర్చుకుంది. ఇంట్లో చెప్పకుండా కూచిపూడి, కధక్ వంటి క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకుంది.

తొలుత యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. తాను కావాలి అని కూడా యాంకర్ అవ్వలేదు. తనకి తెలియకుండా తన ఫ్రెండ్స్ ఫొటో పంపితే.. ఆడిషన్స్ కి వెళ్లింది. ఆ తర్వాత బ్రహ్మానందంతో యాంకర్ గా చేయడానికి ఆహ్వానం లభించింది. అప్పటి నుంచి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఆ తర్వాత నరేశ్ తో కలిసి కౌంట్ డౌన్ అనే కార్యక్రమం చేసింది. తర్వాత కెరీర్ లో అన్నీ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సీరియల్ కస్తూరితోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ సీరియల్ కి వరుసగా ఏడు సంవత్సరాలు ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత రుతురాగాలు, నాన్న అనే ఫేమస్ సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇప్పటికే మీకు ఈ నటి ఎవరో క్లారిటీ వచ్చేసి ఉండాలి.

ఇప్పుడు చెప్పుకుంటున్న యాంకర్, నటి మరెవరో కాదు.. అనితా చౌదరి. ఈమె గురించి తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరేమో? యాంకర్, సీరియల్స్ తర్వాత సినిమాల్లో కూడా తన మార్క్ చూపించింది. తొలుత శ్రీకాంత్ సినిమాలో అనితా చౌదరిని హీరోయిన్ గా స్క్రీన్ టెస్ట్ చేశారు. కానీ, వరుసగా 6 నెలలు డేట్స్ కోరడంతో అనితా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత రాజా సినిమాలో యాంకర్ పాత్రలో నటించింది. తన కెరీర్లో దాదాపు 50 సినిమాల్లో నటించింది. మరి.. అనితా చౌదరి కెరీర్లో మీకు బాగా నచ్చిన సీరియల్/సినిమా ఏదో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి