iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడో ప్యాన్‌ ఇండియా స్టార్‌.. వరుసగా అన్నీ హిట్లే..

తండ్రి వారసత్వంతో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ ఉన్నారు.

తండ్రి వారసత్వంతో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ ఉన్నారు.

ఈ చిన్నారి ఇప్పుడో ప్యాన్‌ ఇండియా స్టార్‌.. వరుసగా అన్నీ హిట్లే..

సెలెబ్రిటీల పిల్లలు సినిమాల్లోకి రావటం హీరోలుగానో.. హీరోయిన్లుగానో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం సాధారణంగా జరిగేదే. అయితే, లక్‌తో పాటు టాలెంట్‌ ఉన్న వారు స్టార్లుగా ఎదుగుతూ ఉంటారు. లేదంటే.. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మిగిలిపోతూ ఉంటారు. ఇది సెలెబ్రిటీల కుమారులకైనా.. కూతుళ్లకైనా వర్తిస్తుంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఓ సెలెబ్రిటీ కూతురు. తండ్రి వారసత్వంతోనే సినిమాలోకి అడుగుపెట్టారు.

పదేళ్ల క్రితం హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టారు. తమిళంతో పాటు కన్నడ, మలయాళంలో కూడా హీరోయిన్‌గా సినిమాలు చేశారు. అయితే, ఆమెకు హీరోయిన్‌గా ఎక్కువ అవకాశాలు రాలేదు. తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ వస్తున్నారు. తెలుగులో అద్భుతమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఈమె లేని సినిమాలు చాలా తక్కువ ఉన్నాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని నమోదు చేశాయి.

varalakshmi sarath kumar child pics

తాజాగా, ఓ ప్యాన్‌ ఇండియా సూపర్‌ హీరో సినిమాలో ఆమె నటించారు. ఆ మూవీ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయింది. ఇప్పటికే మీకు ఆ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో అర్థం అయిపోయి ఉంటంది. ఆమె ఇంకెవరో కాదు.. ప్రముఖ తమిళ నటుడు శరత్‌ కుమార్‌ కూతురు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. వరలక్ష్మీ 2012లో వచ్చిన ‘‘ పోడాపోడీ’’ అనే చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

గత రెండేళ్లుగా తెలుగులో బిజీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయిపోయారు.  ఆమె నటించినా సినిమాల్లో చాలా వరకు హిట్లు సాధిస్తూ ఉన్నాయి. 2023లో ఆమె నటించిన కోట బొమ్మాళి పీఎస్‌ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు హనుమాన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో హీరో అక్క పాత్రలో నటించారు. హనుమాన్‌ శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదల అయింది. అన్ని భాషల్లో సినిమాకు మంచి టాక్‌ వస్తోంది. జనం హనుమన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. మరి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సినిమా జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobetjojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomgrandpashabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabet