iDreamPost
android-app
ios-app

Thalapathy Vijay: మాస్కోలో విజయ్ ‘ది గోట్’ షూటింగ్

  • Published Feb 29, 2024 | 1:09 PM Updated Updated Feb 29, 2024 | 1:09 PM

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Feb 29, 2024 | 1:09 PMUpdated Feb 29, 2024 | 1:09 PM
Thalapathy Vijay: మాస్కోలో విజయ్ ‘ది గోట్’ షూటింగ్

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్‌ (The GOAT) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ సూపర్ స్టార్ గా అమితమైన ఇమేజ్/ స్టార్ డమ్ సంపాదించుకున్న విజయ్… ఇటీవలే రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన పోలిటికల్ ఎంట్రికి ముందు రాబోతున్న రెండు సినిమాల్లో ది గోట్ ఒకటి అవ్వడంతో ఈ చిత్రం పై విజయ్ అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ తో పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేసే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ది గోట్ సినిమా షూటింగ్‌ ను శరవేగంగా జరుపుతున్నారు. తాజాగా చిత్ర నిర్మాత అర్చన కళాపతి సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ను పంచుకున్నారు. మాస్కో నుంచి లొకేషన్ పిక్ షేర్ చేసిన నిర్మాత కళాపతి త్వరలోనే ది గోట్ సినిమా షూటింగ్‌ ఇక్కడ జరుపబోతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం లొకేషన్స్‌ రెక్కీ జరుగుతున్నట్లుగా కూడా ఆమె తన పోస్ట్‌ ద్వారా తెలిపి అభిమానులను అలరించారు. చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే కొందరు మాస్కోకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విజయ్ కి జోడీగా హీరోయిన్ గా నటించబోతున్నారు. కాగా జయరామ్‌, స్నేహా, యోగి బాబు, అజ్మల్‌ అమీర్‌, మైక్ మోహన్‌, వైభవ్‌ ఇంకా ప్రముఖ నటీ నటులు కూడా ది గోట్ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించబోతున్నట్లు నిర్మాతలు సినిమా పూజ కార్యక్రమం రోజే ప్రకటించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సెకండ్‌ యూనిట్‌ తో చిత్రీకరణ జరుపుతున్నారని, త్వరలోనే మాస్కో లో షూటింగ్‌ కు ఇతర యూనిట్‌ సభ్యులతో పాటు దళపతి విజయ్‌ కూడా జాయిన్ అవుతారని అంటున్నారు. మరి ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్‌ (The GOAT) సినిమాతో విజయ్ తన అభిమానులని అలరించే ఒక భారీ బ్లాక్ బస్టర్ అందిస్తారని ఆశిద్దాం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş