iDreamPost
android-app
ios-app

గోవిందా గోవిందా మూవీలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎంతలా మారిపోడంటే..?

  • Published Aug 28, 2024 | 4:19 PM Updated Updated Aug 28, 2024 | 4:19 PM

Govinda Govinda: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సూపర్ న్యాచురల్ హేస్ట్ చిత్రం గోవిందా, గోవిందా. నాగార్జున, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించగా.. ఇందులో ముఖ్యమైన పాత్రను పోషించాడు ఓ చిన్నారి. ఇప్పుడు ఈ బాల నటుడు ఎంతలా మారిపోయాడంటే..?

Govinda Govinda: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సూపర్ న్యాచురల్ హేస్ట్ చిత్రం గోవిందా, గోవిందా. నాగార్జున, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించగా.. ఇందులో ముఖ్యమైన పాత్రను పోషించాడు ఓ చిన్నారి. ఇప్పుడు ఈ బాల నటుడు ఎంతలా మారిపోయాడంటే..?

  • Published Aug 28, 2024 | 4:19 PMUpdated Aug 28, 2024 | 4:19 PM
గోవిందా గోవిందా మూవీలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎంతలా మారిపోడంటే..?

ఒకప్పుడు తమ క్యూట్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న చైల్ట్ ఆర్టిస్టులు.. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి మెస్మరైజ్ చేస్తున్నారు. మరికొంత మంది నటీనటులు మాత్రం బాలనటులుగానే తెరమరుగౌతున్నారు. అటువంటి వారిలో ఈ చైల్డ్ ఈ ఆర్టిస్ట్ ఒకరు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా వచ్చిన గోవిందా గోవిందా చిత్రంలో ముఖ్య పాత్రను పోషించిన ఈ బాలనటుడు. ఒక్క మూవీతోనే క్లిక్ అయ్యాడు. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసి మాయం అయ్యాడు. ఇంతకు ఆ బాల నటుడు ఎవరంటే.. అనిల్ రాజ్. గోవిందా గోవిందా షూటింగ్ సమయంలోనే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. తను తీయబోయే చిత్రాల్లో ఆఫర్ చేయడంతో అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, రాజసింహం వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత కనిపించలేదు. ప్రస్తుతం ఈ నటుడు ఎంతలా మారిపోయాడంటే.?

అనిల్ రాజ్ పోలవరపు. అమలా పురంలో పుట్టిన ఈ చైల్డ్ ఆర్టిస్టు స్వస్థలం వైజాగ్. చిన్న వయస్సు నుండే ఆట పాటల్లో రాణించేవాడు. కరాటే బ్లాక్ బెల్ట్ సాధించాడు. అంతేకాదు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఇతడి ప్రతిభను కొనియాడుతూ వార్త పత్రికలు న్యూస్ రాసేవి. అలా రామ్ గోపాల్ వర్మ కళ్లల్లో పడ్డాడు ఈ చిన్నోడు. వెంటనే గోవిందా గోవిందా చిత్రం ఆఫర్ చేయడంతో నటించాడు. 1994లో విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు జంధ్యాల డైలాగ్స్ రాయడం విశేషం. కల్ట్ క్లాసిక్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత రాజశేఖర్ అల్లరి ప్రియుడు, వెంకటేశ్ ముద్దుల ప్రియుడులో రమ్య కృష్ణ గ్యాంగ్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. రాజశేఖర్ రాజసింహంలో కనిపించాడు.

Govinda Govinda, Ram Gopal Varma, Anil Raj 01

చదువుల దృష్ట్యా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు ఈ కుర్రాడు.. హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. IIHM నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సును అభ్యసించాడు. సినిమాల్లో కంబ్యాక్ ఇచ్చేందుకు నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత హీరోగా ఎందుకు కనిపించలేదు తెలియరాలేదు. కానీ ఇటీవల తాజాగా బాల నటుల్ని అందర్ని ఓకే వేదికపైకి తీసుకు వచ్చింది ఓ యూట్యూబ్ ఛానల్. ఈ సందర్భంగా ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. అప్పుడు గోవిందా గోవిందా యాక్టర్ అనిల్ రాజ్ కూడా వచ్చాడు. అందులో కొద్దిసేపే మాట్లాడాడు. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.. ఈ కుర్రాడు. అయితే ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఉంటున్నాడన్న విషయాలు తెలియరాలేదు. మళ్లీ ఆ విషయాలను వెల్లడిస్తానని చెప్పాడు. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోలుగా మారుతున్న తరుణంలో అనిల్ కూడా రావాలని కోరుకుంటున్నారు కొందరు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş