iDreamPost
android-app
ios-app

శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం అయిన పక్క రోజే నాగచైతన్య మంచి పని!

  • Published Aug 10, 2024 | 4:55 PM Updated Updated Aug 10, 2024 | 4:55 PM

Naga Chaitanya: లవ్ బర్డ్స్ నాగ చైతన్య- శోభిత ఇటీవల నిశితార్థం వేడుక చేసుకున్నారు. శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం అయిన పక్క రోజే నాగచైతన్య మంచి పని వార్తల్లో నిలిచాడు. ఇంతకు చైతూ ఏం చేశాడంటే.?

Naga Chaitanya: లవ్ బర్డ్స్ నాగ చైతన్య- శోభిత ఇటీవల నిశితార్థం వేడుక చేసుకున్నారు. శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం అయిన పక్క రోజే నాగచైతన్య మంచి పని వార్తల్లో నిలిచాడు. ఇంతకు చైతూ ఏం చేశాడంటే.?

  • Published Aug 10, 2024 | 4:55 PMUpdated Aug 10, 2024 | 4:55 PM
శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం అయిన పక్క రోజే నాగచైతన్య మంచి పని!

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నెల 8న సన్నిహితులు, బంధువుల మధ్య సింపుల్ అండ్ స్వీట్‌గా చేసుకున్నాడు. వైట్ షేర్వాణీలో చైతూ, పింక్ శారీలో శోభిత మెరిసిపోయారు. ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం విషయాన్ని వెల్లడించిన చైతూ తండ్రి నాగార్జున.. విడాకులు అనంతరం చైతన్య ఎంతో బాధపడ్డాడని, ఎవరితోనూ ఆ బాధను పంచుకోలేదని చెప్పాడు. తన తనయుడు తిరిగి సంతోషంగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని తెలిపాడు. ఇదిలా ఉంటే నిశ్చితార్ధం అయిన మరసటి రోజే చైతూ.. ఓ మంచి పని చేసి వార్తల్లో నిలిచాడు.

తన ఎంగేజ్ మెంట్ పూర్తయిన మరుసటి రోజే రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యాడు చైతన్య. తన దగ్గర వర్క్ చేస్తున్న అసిస్టెంట్ వెంకటేశ్ పెళ్లికి హాజరయ్యాడు. అక్కడి విచ్చేసి నూతన వధూవరులనే కాదు.. పెళ్లిలోని వారందరినీ సర్ ప్రైజ్ చేశాడు. అతడి రాకతో అందరూ సంభ్రమాశ్చర్యంలో మునిగితేలిపోయారు. పెళ్లికి వచ్చిన అతిధులు సైతం చైతూను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో పెళ్లి కోలాహలంతో పాటు సెలబ్రిటీ ఎంట్రీతో మరింత సందడి నెలకొంది. అనంతరం చైతూ పాదాలకు  పెళ్లి కూతురు నమస్కారం చేసింది ఆశీస్సులు తీసుకుంది. నవ దంపతులను ఆశీర్వదించిన ఈ యంగ్ హీరో. అతడితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు స్థానికులు గుమిగూడారు. వీలైనంత వరకు ఫోటోలు దిగి.. అక్కడి నుండి వెళ్లిపోయాడు చైతూ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

naga chaitanya attended assistant marriage

దీంతో చైతూది ఎంత మంచి మనస్సు అంటూ కొనియాడుతున్నారు అతడి ఫ్యాన్స్. అసిస్టెంట్ పెళ్లికి అంత దూరం వెళ్లడమే కాకుండా ఆశీర్వదించి రావడంతో సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక చైతూ సినిమా విషయానికి వస్తే.. చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. రాజు అనే మత్య్సకారుడి పాత్రలో నటిస్తున్నాడు ఈ అక్కినేని వారసుడు. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి మరోసారి జతకట్టబోతుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే పుష్ఫ, గేమ్ ఛేంజర్ మూవీలు కూడా క్రిస్మస్ బరిలోనే నిలుస్తుండటంతో ఈ మూవీ తప్పుకునే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. మరీ ఆ డేట్ కే వస్తుందా.. లేక ఆలస్యమౌతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpuan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş