iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ – సిద్ధూ జొన్నలగడ్డలకు గోల్డెన్ ఛాన్స్

  • Published Mar 21, 2024 | 10:17 AM Updated Updated Mar 21, 2024 | 12:39 PM

ఈ నెలాఖరున అంటే మార్చి 29న సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్', విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' ఏప్రిల్ 5న విడుదల కానున్నాయి. ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులు, అభిమానుల దృష్టి ఈ రెండు సినిమాల పైనే ఉంది.

ఈ నెలాఖరున అంటే మార్చి 29న సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్', విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' ఏప్రిల్ 5న విడుదల కానున్నాయి. ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులు, అభిమానుల దృష్టి ఈ రెండు సినిమాల పైనే ఉంది.

  • Published Mar 21, 2024 | 10:17 AMUpdated Mar 21, 2024 | 12:39 PM
విజయ్ దేవరకొండ – సిద్ధూ జొన్నలగడ్డలకు గోల్డెన్ ఛాన్స్

టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఏడాది సంక్రాంతి సీజన్ చక్కటి వినోదాన్ని అందించింది. హనుమాన్, గుంటూరు కారం, నా సామి రంగా వంటి సినిమాలు సక్సెస్ గా నిలిచి పండగ రోజుల్లో సినీ ప్రేమికులని అలరించాయి. అయితే ఆ తరువాత నుంచీ ఒక సరైన హిట్ లేకుండా పోయింది. దాంతో అందరి చుపూ సమ్మర్ పైనే పడింది. నిజానికి మొదట్లో 2024 సమ్మర్ మొత్తం పెద్ద సినిమాలతో నిండిపోతుందని అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ దేవర తో సహా పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవడంతో చిన్న సినిమాలకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకాశం యువ హీరోలైన విజయ్ దేవరకొండ, సిద్ధూ జొన్నలగడ్డల వద్దకు వచ్చింది.

ఈ నెలాఖరున అంటే మార్చి 29న సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్’, విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న విడుదల కానున్నాయి. ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులు, అభిమానుల దృష్టి ఈ రెండు సినిమాల పైనే ఉంది. ఈ రెండు సినిమాలూ గనక అంచనాలను అందుకుని విజయం సాధిస్తే ఖచ్చితంగా సీజన్ హెల్ప్ తో బాక్సాఫీస్ వద్ద ఊహించిన దాని కంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తాయి. ఎందుకంటే వేసవిలో విద్యార్థులందరూ సెలవుల్లో ఉన్న సమయంలో సినిమాలకి మంచి టాక్ వస్తే భారీ కలెక్షన్లు సాధిస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ గొప్ప అవకాశాన్ని ఇద్దరు యువ హీరోలు సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి.

Golden chance for Vijay Devarakonda - Sidhu Jonnalagadda

ఫ్యామిలీ స్టార్ చిత్రానికి పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా, లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండకు జోడిగా నటించారు. ఇప్పటికీ విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులని అలరించాయి. ముఖ్యంగా కల్యాణి వచ్చా వచ్చా పాట సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా కంటే ఒక వారం ముందు విడుదల కానున్న టిల్లు స్క్వేర్ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకత్వం వహించారు. సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి టిల్లు అన్న పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే సినిమా ట్రైలర్, సాంగ్స్ లో కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ షో చేసి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు. మరి డీజే టిల్లు సీక్వెల్ అనే క్రేజ్ కు తోడు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తే ఈ సినిమా జోరుకి అడ్డే లేకుండా పోతుంది. ఇక టిల్లు స్క్వేర్ – ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో ఏది పెద్ద హిట్ అవుతుందని సినీ వర్గాలతో పాటు ట్రేడ్ పండితులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.