Krishna Kowshik
థియేటర్లలో కొత్త సినిమాలతో పాటు పాత చిత్రాలు అలరిస్తున్నాయి. రీ రిలీజ్ నయా ట్రెండ్ పుణ్యమా అని.. గల్లా పెట్టి నిండుతుంది. అయితే ఇప్పుడు ఓ రీ రిలీజ్ మూవీ.. రికార్డులు సృష్టిస్తోంది. అదే..
థియేటర్లలో కొత్త సినిమాలతో పాటు పాత చిత్రాలు అలరిస్తున్నాయి. రీ రిలీజ్ నయా ట్రెండ్ పుణ్యమా అని.. గల్లా పెట్టి నిండుతుంది. అయితే ఇప్పుడు ఓ రీ రిలీజ్ మూవీ.. రికార్డులు సృష్టిస్తోంది. అదే..
Krishna Kowshik
ప్రస్తుతం ఇండస్ట్రీలో నయా ట్రెండ్ నడుస్తోంది. అదే రీ రిలిజ్.. ఓల్డ్ సినిమాలను మళ్లీ రీ రిలీజ్ పేరుతో థియేటర్లలో విడుదల చేస్తున్నారు చిత్ర మేకర్స్. అప్పట్లో సూపర్ హిట్ కొట్టిన చిత్రాలే కాకుండా.. ఆ రోజుల్లో మెప్పించలేకపోయినా.. ఆ తర్వాత ఈ సినిమా ఎలా ప్లాప్ చేశారాం అని భావిస్తున్న సినిమాలను, మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ పిక్చర్స్‌ను మళ్లీ విడుదల చేస్తున్నారు. జనరేషన్ గ్యాప్ కారణంగా కొన్ని సినిమాలను మిస్ అయిన యూత్ కూడా టీవీల్లో చూసినప్పటికీ.. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం వచ్చి సినిమాలు చూస్తున్నారు. అలాగే తమ ఫేవరేట్ హీరో ఓల్డ్ మూవీస్.. మళ్లీ చూడాలన్న ఉద్దేశంతో కూడా రీ రిలీజ్ చేస్తుంటే.. వీక్షించి, ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా తమిళనాడులో కూడా ఇదే కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు అక్కడ. దీంతో పాత బ్లాక్ బస్టర్ సినిమాలనే విడుదల చేస్తున్నారు. అలా రీ రిలీజ్ అయిన సినిమానే గిల్లి. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఒక్కడు మూవీకి రీమేక్ ఇది. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీ రిలీజ్‌కు నోచుకుంది. 2004 ఏప్రిల్ 17న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయగా.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ. 3 కోట్లు వసూలు చేయడం గమనార్హం.
అయితే తొలి రోజు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రికార్డు స్థాయిలో రూ. 10 కోట్లను కొల్లగొట్టింది. అంటే సినిమా బడ్జెట్ కన్నా రెండు కోట్లు ఎక్కువ. తెరపై విజయ్ కనబడగానే ఈలలు, కేకలు, అరుపులతో థియేటర్లను దద్దరిల్లేలా చేశారు అతడి ఫ్యాన్స్. ఇక అప్పడి పోడు సాంగ్స్ అయితే ఊగిపోయారు. ఈ వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. త్రిష సైతం.. అభిమానులు చూపించిన ఆదరణ ఉబ్బితబ్బిబ్బు అయిపోతూ ఎమోషనల్ పోస్టు చేసింది కూడా. కాగా, గిల్లికి ఈ రేంజ్‌లో కలెకషన్స్ రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏంట్రా బాబు ఈ కలెక్షన్లు అనుకుంటున్నారు. స్టార్ హీరో కొత్త సినిమాకు కూడా ఇంత వసూళ్లు రావడం కష్టం అవుతున్న ఈ సమయంలో పాత సినిమాకు ఇన్ని కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు మాటలు కాదు.
ఇప్పటి వరకు ఇన్ని తెలుగు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.. కానీ ఈ ఫీట్ ఓ హీరో టచ్ కూడా చేయలేదు. కానీ విజయ్ సాధించేశాడు. సాధారణంగా తమిళనాడులో రజనీకాంత్ తర్వాత విజయ్‌కు గణనీయ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇళయదళపతికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకున్న అభిమాన సంఘాల సంఖ్య కూడా చాలా ఎక్కువ. దీనికి తోడు.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి మరింతగా ప్రజలతో మమైకమౌతున్నాడు. అంతేకాకుండా రెండు, మూడు సినిమాలతో యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. పూర్తి స్థాయిలో పొలిటికల్ కెరీర్‌పై దృష్టి పెట్టనున్నాడు. విజయ్ ఇక తెరపై కనిపించబోయేది తక్కువ కాబట్టే..ఇప్పుడు తమ అభిమానాన్ని మరొక్కసారి చూపించారు తమిళ తంబీలు.
Finally 💥♥️ Witnessed My Favourite #Ghilli in Theatre 😎✌🏾🔥 What a EXPERIENCE it was 🛐🔥The Craze after 2 Decades is the Same Like First Day of Release🔥 Will Watch Again in Theatre ✌🏾#ThalapathyVIJAY #Trisha #GhilliFestival #GhilliManiaFromToday #TheGreatestOfAllTime https://t.co/nLSkAaVdY5 pic.twitter.com/YvAKWmo0ur
— 𝐕𝐢𝐣𝐚𝐲 𝐊𝐚𝐫𝐭𝐡𝐢𝐤𝐞𝐲𝐚𝐧ツ🥷🏼 (@Vijay_Karthik27) April 20, 2024