iDreamPost
android-app
ios-app

మాజీ భర్తనే పెళ్లాడిన ఓ భార్య కథ! హ్యాట్సాఫ్!

భారత దేశంలో వివాహ వ్యవస్థకు గొప్ప పేరుంది. వివాహం బంధంలోకి అడుగుపెట్టిన నూటికి 70 శాతం జంటలు ఆ బంధానికి విలువ ఇస్తూ ఉన్నాయి. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా కూడా సర్ధుకుపోతున్నాయి.

భారత దేశంలో వివాహ వ్యవస్థకు గొప్ప పేరుంది. వివాహం బంధంలోకి అడుగుపెట్టిన నూటికి 70 శాతం జంటలు ఆ బంధానికి విలువ ఇస్తూ ఉన్నాయి. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా కూడా సర్ధుకుపోతున్నాయి.

మాజీ భర్తనే పెళ్లాడిన ఓ భార్య కథ! హ్యాట్సాఫ్!

ధర్మ, అర్ధ, కామ, మోక్షాలలో తోడుగా నిలిచేది దాంపత్య బంధం. కానీ, ప్రస్తుత కాలంలో బంధాలు బలహీనమైపోతున్నాయి. ప్రేమికులు మొదలు దంపతుల వరకు చిన్న చిన్న మనస్పర్థలకు బంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నారు. వైవాహిక బంధంలో ఏర్పడే చిన్న సమస్యలకు.. సర్దుకుపోవడం మర్చిపోయి విడాకుల వరకు వెళ్తున్నారు. విడిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళవి అన్నట్లుగా భావిస్తున్నారు. అయితే , ఈ తరుణంలో ఘజియాబాద్‌కు చెందిన ఓ విడిపోయిన జంట మాత్రం అందరికీ ఆదర్శంగా నిలిచింది. విడాకుల తర్వాత తన మాజీ భర్తనే పెళ్ళాడి ఓ భార్య అందరిచేత హ్యాట్సాఫ్ అనిపించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

2012లో ఘజియాబాద్‌లోని కౌశాంబి జిల్లాకు చెందిన పూజ, విన‌య్‌లు వివాహం చేసుకున్నారు. వారి దాంపత్య జీవనం కొంతకాలం సవ్యంగానే సాగింది. కానీ, ఒక సంవత్సరం తర్వాత వారి మధ్యన మనస్పర్థలు మొదలయ్యాయి. దానితో , వారు పరస్పర అవగాహనతో విడాకులు తీసుకోడానికి సిద్ధం అయ్యారు. కానీ, వీరికి విడాకులు వెంటనే మంజూరు కాలేదు. దాదాపు, వారి వివాహం అయిన ఐదు సంవత్సరాల తర్వాత అంటే 2018 లో సుప్రీం కోర్టును ఆశ్రయించినపుడు వీరికి విడాకులు మంజూరు చేశారు.

అయితే, వీరి విడాకులు అయిన ఆ సంవత్సరంలోనే వినయ్ కు గుండె పోటు వచ్చింది. దీంతో అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేశారు. ఈ విషయం పూజకు తెలిసింది. ఈ విషయం తెల్సిన తర్వాత పూజ మనసు చలించింది. అప్పటికే వారిద్దరూ విడిపోయినప్పటికీ పూజ తన మాజీ భర్తను చూసేందుకు హాస్పిటల్‌కు వెళ్ళింది. పూజని చూసిన తర్వాత వినయ్ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. అలా ఓ గంట వ్యవధిలోనే వారిద్దరూ మరలా కలిసిపోయారు.

వినయ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వారి విడాకులను రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో మరోసారి పూజ తన మాజీ భర్తను వివాహం చేసుకుంది. ఇక చిన్న చిన్న విషయాలకు విడిపోయేవారికి.. పూజ, వినయ్‌ల జీవితంలోని మార్పు ఓ గుణపాఠంలా చెప్పుకోవచ్చు. ఏదేమైనా పెళ్ళినాటి ప్రమాణాలను ఈ జంట తిరిగి సార్ధకం చేసుకుంది. వైవాహిక జీవితంలో వచ్చే అలకలు వచ్చి పోయే మేఘాల లాంటివి. కాసేపు వాటిని పక్కనపెడితే జీవితాంతం ఆ దంపతులు సంతోషంగా ఉంటారని పూజ, వినయ్‌లు నిరూపించారు. మరి, గుండె పోటు వచ్చిన మాజీ భర్తకు తోడుగా నిలవడానికి మళ్లీ అతడ్నే పెళ్లి చేసుకున్న పూజ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.