iDreamPost
android-app
ios-app

వీడియో: ఆ రోజు నాన్న నన్ను చూసి ఏడ్చేశారు: సితార

  • Published Aug 23, 2024 | 6:47 PM Updated Updated Aug 23, 2024 | 6:47 PM

Ghattamaneni Sitara- Mahesh Babu And PMJ Ad: ఘట్టమనేని సితార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అయినా కూడా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. అందుకే సితార ఎక్స్ క్లూజివ్ గా ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోండి.

Ghattamaneni Sitara- Mahesh Babu And PMJ Ad: ఘట్టమనేని సితార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అయినా కూడా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. అందుకే సితార ఎక్స్ క్లూజివ్ గా ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోండి.

  • Published Aug 23, 2024 | 6:47 PMUpdated Aug 23, 2024 | 6:47 PM
వీడియో: ఆ రోజు నాన్న నన్ను చూసి ఏడ్చేశారు: సితార

ఘట్టమనేని సితారకు స్టార్ కిడ్ గా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు ఉంది. అయితే సితార ఎప్పుడూ తాను ఒక స్టార్ కిడ్ అనే గర్వాన్ని చూపించదు. చాలా డౌన్ టూ ఎర్త్ గా ఉంటుందని అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచే తండ్రి మహేశ్ బాబు బాటలోనే సేవా కార్యక్రమాలు, మంచి పనులు చేయడంలో బిజీ బిజీగా గడిపేస్తోంది. తండ్రికి తగ్గ తనయ అనిపించుకోవడంలో సితార ఇప్పుడే సక్సెస్ అయిపోయింది. మరోవైపు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడా ఏర్పచుకుంటోంది. సితారకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన డ్యాన్స్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. తను ఇప్పటికే ఒక సెలబ్రిటీ అనే విషయాన్ని అంగీకరించి తీరాల్సిందే. పీఎంజే అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. అయితే ఈ ఎండార్స్ మెంట్ సమయంలో ఒక ఎమోషనల్ విషయం జరిగిందని సితార తాజాగా రివీల్ చేసింది.

మహేశ్ బాబు కుమార్తె సితార తాజాగా ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూలో చాలానే ఇంట్రెస్టింగ్ అంశాలను పంచుకుంది. అలాగే తనకు సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అందులో భాగంగానే మహేశ్ బాబు ఓ రోజు దాదాపుగా ఏడ్చినంత పని చేశారు అంటూ సితార చెప్పుకొచ్చింది. అది మరెప్పుడో కాదు.. పీఎంజే బ్రాండ్ కి సితార అంబాసిడర్ గా వ్యవహిరించిన యాడ్ ని రిలీజ్ చేసిన సమయంలోనే అంట. సితార మాట్లాడుతూ.. ‘నా పీఎంజే యాడ్ చూసిన తర్వాత నాన్న ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా యాడ్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యింది’ అంటూ సితార వెల్లడించింది. మహేశ్ బాబుకు కుమార్తెకు ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. తన కుమార్తెను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా చూడగానే.. ఆయన దాదాపుగా ఏడ్చేశారంట.

sithara talk about her father

అలాగే తనకు వచ్చిన ఆ రెమ్యూనరేషన్ ని కూడా సితార ఛారిటీకి ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప మనసు చాటుకున్న సితారపై ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. అలా ఇచ్చేయడం ఎలా ఉంది అని అడగ్గా.. ఛారిటీకి ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటూ సితార వెల్లడించింది. ఇంక తన హాబీస్, తన ఇష్టాలు, తనకు కష్టమైన విషయాలు ఏంటి? ఇలా చాలానే ఇంట్రెస్టింగ్ విషయాలను సితార ఈ ఇంటర్వ్యూలో పంచుకుంది. ముఖ్యంగా మహేశ్ బాబు ఫ్యామిలీకి సంబంధించి సితార ఎన్నో విషయాలను, ఫ్యాన్స్ కి కూడా తెలియని చాలానే ఆసక్తికర అంశాలను ఈ ఇంటర్వయ్యూలో ప్రస్తావించింది. ఈ కింది వీడియోలో సితార ఘట్టమనేని పూర్తి ఇంటర్వ్యూ చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom