Dharani
Garikapati Narasimha Rao-Pan India Movies: ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ అవార్డుగ్రహీత గరికపాటి నరసింహరావు.. పాన్ ఇండియా సినిమాల మీద వేసిన సెటైర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
Garikapati Narasimha Rao-Pan India Movies: ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ అవార్డుగ్రహీత గరికపాటి నరసింహరావు.. పాన్ ఇండియా సినిమాల మీద వేసిన సెటైర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
Dharani
ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలో వినిపించే పేరు పాన్ ఇండియా సినిమా. గత కొన్నేళ్లుగా ప్రతి ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చేస్తున్నాయి. టాలీవుడ్ నుంచి అయితే బాహుబలి సినిమాతో ఈ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. చాలా వరకు చిత్రాలను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలందరు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతోనే బిజీగా ఉన్నారు. అయితే మరి అన్ని సినిమాలకు ఈ పాన్ ఇండియా అనే ట్యాగ్ వర్తిస్తుందా.. అదే స్థాయిలో రాణిస్తున్నాయా అంటే కాదు. చాలా వరకు సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ఫలితం గురించి ఆలోచించకుండా చాలా మంది మేకర్స్, హీరోలు.. పాన్ ఇండియా సినిమాల మీదనే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత పాన్ ఇండియా సినిమాల మీద చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు.. అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పాన్ ఇండియా సినిమాలపై నందమూరి తారకరామరావు అభిప్రాయం ఎలా ఉండేదే.. ఈ సందర్భంగా గరికపాటి వివరించారు. సన్నిహితుల ద్వారా విన్న సమాచారాన్ని ఈ సందర్భంగా గరికపాటి షేర్ చేసుకున్నారు. కోటి రూపాయలు ఇచ్చినా సరే.. ఎన్టీఆర్ ఇలాంటి సినిమాలు చేయడానికి అంగీకరించలేదని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా గరికపాటి నరసింహరావు.. పాన్ ఇండియా సినిమాలపై ఎన్టీఆర్ ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చారో తెలియజేస్తూ..‘‘నేటి కాలంలో రిలీజైన ప్రతి సినిమాను పాన్ ఇండియా అనే అంటున్నారు. మన ప్రాణాలు తీసే సినిమా అయినా సరే పాన్ ఇండియానే అంటున్నారు. కానీ అప్పట్లో ఎన్టీ రామారావు గారికి.. కృష్ణుడు, రాముడు పాత్రలు హిందీలో చేయండి.. రూ.కోటి పారితోషికం ఇస్తాను అని కొందరు ఆఫర్ చేశారు. అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘‘కోటి ఎందుకండి.. రాముడు, కృష్ణుడు మీద బోలేడు కథలు రావాల్సి ఉంది. వాటిని తెలుగులో తీయండి. నాకు 10 లక్షల రూపాయలు చాలు. నా భాషకు మేలు జరుగుతుంది.. నా వాచకం ద్వారా నా భాషకు మేలు జరగాలి.. నాకు కాదు’’ అంటూ కోటి రూపాయల ఆఫర్‌ను వదులుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు. గరికపాటి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.