Nidhan
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ కోసం ఆడియెన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ కోసం ఆడియెన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Nidhan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను బిగ్ స్క్రీన్ మీద చూసి చాలా కాలమైంది. చివరగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన వెండితెరపై మెరిశారు. ఈ సినిమా విడుదలై దాదాపు రెండున్నరేళ్లు కావొస్తోంది. ఇంత గ్యాప్ వచ్చినా చరణ్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆయన మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన బజ్ నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన అద్భుతమైన నటనను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. మరోమారు సిల్వర్‌స్క్రీన్ మీద చరణ్ యాక్టింగ్ మ్యాజిక్‌ను ఎంజాయ్ చేద్దామని ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు చరణ్. ఈ సినిమా క్రిస్మస్కు విడుదలవుతుందని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవలే అనౌన్స్ చేశారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘గేమ్ ఛేంజర్’తో ఈపాటికే చరణ్ థియేటర్లలో సందడి చేసేవారు. కానీ డైరెక్టర్ శంకర్ ‘భారతీయుడు 2’తో పాటు ఏకకాలంలో ‘గేమ్ ఛేంజర్’ను తీయడంతో ఆలస్యమైంది. ‘భారతీయుడు’ సీక్వెల్ విడుదలవడంతో.. చరణ్ సినిమా పనుల్లో బిజీ అయిపోయారు శంకర్. నిర్మాత దిల్ రాజు క్రిస్మస్కు వస్తున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పడంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. డిసెంబర్ 20న ‘గేమ్ ఛేంజర్’ను భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయని తెలుస్తోంది. ఈ తరుణంలో ‘గేమ్ ఛేంజర్’ పోస్ట్‌పోన్ అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండటం అభిమానులను టెన్షన్ పెడుతోంది. ‘గేమ్ ఛేంజర్’ వస్తున్న క్రిస్మస్ వీక్‌కే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
చరణ్ మూవీ వల్ల నార్త్‌లో తమకు థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉండటంతో ‘గేమ్ ఛేంజర్’ను పోస్ట్‌పోన్ చేయాంటూ మెగాస్టార్ చిరంజీవిని ఆమిర్ కోరారని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటు టాలీవుడ్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘తండేల్’ కూడా క్రిస్మస్ ఫెస్టివల్‌నే టార్గెట్ చేస్తూ వస్తోంది. క్రిస్మస్ దాటితే సంక్రాంతి ఉంటుంది, ఆ పండక్కి అన్ని స్లాట్లు బుక్ అయిపోయాయి కాబట్టి తమ కోసం వెనక్కి తగ్గమని చరణ్‌ను అరవింద్ కోరుతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఒకవేళ కాదని అదే తేదీకి విడుదల చేస్తే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో స్క్రీన్లు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ లాభాల్లోకి వెళ్లాలంటే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టాలి. అది జరగాలంటే సోలో రిలీజ్ బెటర్ ఆప్షన్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఈ కారణాల రీత్యా చరణ్ మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అవడం పక్కా అని రూమర్స్ వస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం.