iDreamPost
android-app
ios-app

పుష్ప రాక కోసం ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్.. కారణం ఇదే!

  • Published Jul 20, 2024 | 12:58 PM Updated Updated Jul 20, 2024 | 12:58 PM

Game Changer Release Depends on Pushpa-2: ఇప్పుడు ప్రేక్షకుల అందరి ఎదురుచూపులు.. బడా హీరోల భారీ బడ్జెట్ మూవీస్ కోసమే.. ఈ క్రమంలో పుష్ప-2 రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ మాత్రం పుష్ప మీద డిపెండ్ అయ్యి ఉందట. కారణం ఏమై ఉంటుందో చూసేద్దాం.

Game Changer Release Depends on Pushpa-2: ఇప్పుడు ప్రేక్షకుల అందరి ఎదురుచూపులు.. బడా హీరోల భారీ బడ్జెట్ మూవీస్ కోసమే.. ఈ క్రమంలో పుష్ప-2 రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ మాత్రం పుష్ప మీద డిపెండ్ అయ్యి ఉందట. కారణం ఏమై ఉంటుందో చూసేద్దాం.

  • Published Jul 20, 2024 | 12:58 PMUpdated Jul 20, 2024 | 12:58 PM
పుష్ప రాక కోసం ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్.. కారణం ఇదే!

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూసిన కల్కి మూవీ థియేటర్ లోకి రావడం, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం.. అంతా అయిపొయింది. ఇంకా థియేటర్స్ లో కల్కి మ్యానియా కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా ఎదురుచూసేది. తారక్ , రామ్ చరణ్, బన్నీ చిత్రాల కోసమే. ప్రస్తుతం బాగా హైప్ ఉన్న భారీ బడ్జెట్ మూవీస్ ఇవే. ఇప్పటికి ఈ సినిమాల నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా ఆ సినిమాలపై ప్రేక్షకులకు విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. దీనితో ఎంత త్వరగా ఈ సినిమాలను చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఆ సినిమాల రిలీజ్ డేట్స్ ఏమో వెనక్కు వెళ్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో మరొక కొత్త బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

పుష్ప-2 మూవీ గురించి ఇప్పటికే చాలా అప్ డేట్స్ వచ్చాయి. వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సినిమా పై అంతకు మించిన హోప్స్ ను పెంచేసింది. రిలీజ్ చేసిన ప్రతి గ్లిమ్ప్స్ కు ప్రేక్షకులు హైప్ తో అల్లాడిపోయారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ముందుగా ఆగష్టు లోనే మూవీ రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ఆ రిలీజ్ కాస్త డిసెంబర్ 6 కు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని కూడా అదే నెలలో రిలీజ్ చేశారు మేకర్స్. ఒకవేళ పుష్ప-2 మూవీ కనుక చెప్పిన టైమ్ రిలీజ్ చేస్తే.. గేమ్ ఛేంజర్ సినిమాను డిసెంబర్ 20 న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే పుష్ప రాక కోసం గేమ్ ఛేంజర్ మూవీ ఎదురుచూస్తుందని చెప్పొచ్చు. ఈ రెండు మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయితే కనుక.. ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ పై ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. మరి గేమ్ ఛేంజర్ పుష్ప కంటే ముందు రిలీజ్ చేస్తారో.. లేదా తర్వాత రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ మూవీస్ రిలీజ్ డేట్స్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక గేమ్ ఛేంజర్ మూవీ విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ తనపై అందరి అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈసారి చరణ్ ఎలాంటి క్యారక్టర్ తో ముందుకు వస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ తో ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటాడో వేచి చూడాలి. అయితే రీసెంట్ గా శంకర్ రూపొందించిన భారతీయుడు-2 కు అనుకున్న రేంజ్ లో స్పందన లభించకపోడంతో.. ఆ మూవీ ఎఫెక్ట్ ఏమైనా గేమ్ ఛేంజర్ పై పడుతుందేమో అనే అనుమానాలు అభిమానులకు కలుగుతున్నాయి. ఇక చివరికి ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap