iDreamPost
android-app
ios-app

69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్.. టాలీవుడ్ నుంచి అవార్డులన్నీ ఆ 3 సినిమాలకే!

69th South Filmfare Awards: 69వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్దుల వేడుక హైదరాబాద్ నగరంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది ఇండస్ట్రీ నుండి సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. తెలుగులో మూడు సినిమాలకు ఎక్కువ అవార్డులు దక్కాయి.

69th South Filmfare Awards: 69వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్దుల వేడుక హైదరాబాద్ నగరంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది ఇండస్ట్రీ నుండి సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. తెలుగులో మూడు సినిమాలకు ఎక్కువ అవార్డులు దక్కాయి.

69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్.. టాలీవుడ్ నుంచి అవార్డులన్నీ ఆ 3 సినిమాలకే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నంది అవార్డుల తర్వాత పేరు గాంచినవి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్. కేవలం తెలుగు సినిమాలే కాకుండా దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం ఈ అవార్డుల ఫంక్షన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇది ఆస్కార్ లెవల్లో.. ఇండియాలో అందులోనూ దక్షిణాది సినీ పరిశ్రమ జరుపుకునే సినీ వేడుక. ఈ ఏడాది 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు వేదికైంది హైదరాబాద్. ఆగస్టు 3న అంగరంగ వైభవంగా ఈ సినిమా ఉత్సవం జరిగింది. గత ఏడాది ప్రజాదరణ పొందిన సినిమాలకు అవార్డులు దక్కాయి. తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక హీరోయిన్లు రెడ్ కార్పెట్ పై తమ హోయలొలికించారు.

ఇక తెలుగు కేటగిరిలో నాలుగు సినిమాలకు ఎక్కువ అవార్డులు వరించాయి. గత ఏడాది కుటుంబ కథా చిత్రంగా నిలవడంతో పాటు ఇంటర్నేషనల్ అవార్డులు కొల్లగొట్టిన బలగం ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక నాని రగ్గుడ్ లుక్స్ లో మెస్మరైజ్ చేసిన దసరా, బేబి మూవీలకు కూడా అవార్డులు లభించాయి. దర్శకులు వేణు, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ తమ తొలి సినిమాలతోనే అవార్డులు పొందండం విశేషం. ఇంతకు ఏ సినిమాకు ఏ అవార్డులు వచ్చాయంటే.. ఉత్తమ నటీనటులుగా ఎవరు నిలిచారో ఇప్పుడు చూద్దాం. .

69వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024- టాలీవుడ్ విజేతలు వీరే

ఉత్తమ సినిమా – బలగం

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- బేబి

ఉత్తమ నటుడు – నాని (దసరా)

ఉత్తమ నటి – కీర్తి సురేశ్ (దసరా)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- ప్రకాశ్ రాజ్ (రంగ మార్తాండ), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి)

ఉత్తమ నటి (క్రిటిక్స్)- వైష్ణవి చైతన్య (బేబి)

ఉత్తమ తొలి పరిచయం మేల్- సంగీత్ శోభన్ (మాడ్)

ఉత్తమ దర్శకుడు – వేణు (బలగం)

ఉత్తమ పరిచయ దర్శకుడు – శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)

ఉత్తమ సహాయ నటుడు – రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)

ఉత్తమ సహాయ నటి – రూపలక్ష‍్మి (బలగం)

ఉత్తమ సంగీతం – విజయ్ బుల్గానిన్ (బేబి)

ఉత్తమ సాహిత్యం – అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)

ఉ‍త్తమ గాయకుడు – శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబి)

ఉత్తమ గాయని – శ్వేత మోహన్ (మాస్టారూ మాస్టారూ- సార్)

ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా- దసరా)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – కొల్లా అవినాష్ (దసరా)

ఉత్తమ సినిమాటోగ్రాఫీ – సత్యన్ సూరన్ (దసరా)