డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఇవే! హీరోలు తొందరపడుతున్నారా?

List Of Movies Releasing In December: సంక్రాంతి పండగ టాలీవుడ్ లో కాస్త ముందుగానే వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే? భారీ చిత్రాలన్నీ డిసెంబర్ లోనే థియేటర్లలోకి వస్తున్నాయి. దాంతో బాక్సాఫీస్ వార్ తప్పనట్లు కనిపిస్తోంది. మరి డిసెంబర్ లో వస్తున్న చిత్రాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

List Of Movies Releasing In December: సంక్రాంతి పండగ టాలీవుడ్ లో కాస్త ముందుగానే వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే? భారీ చిత్రాలన్నీ డిసెంబర్ లోనే థియేటర్లలోకి వస్తున్నాయి. దాంతో బాక్సాఫీస్ వార్ తప్పనట్లు కనిపిస్తోంది. మరి డిసెంబర్ లో వస్తున్న చిత్రాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి.. టాలీవుడ్ కు కలిసొచ్చిన పండుగ, పైగా సెంటిమెంట్ కూడా. అందుకే స్టార్ హీరోలు తమ సినిమాలను ఈ పండక్కి బరిలోకి దింపాలని చూస్తుంటారు. సినిమా ప్రారంభం అయినప్పుడే సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించిన సందర్భాలు ఇండస్ట్రీలో కోకొల్లలు. అయితే ఇప్పుడు సంక్రాంతి పండగ టాలీవుడ్ లో కాస్త ముందుగానే వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే? భారీ చిత్రాలన్నీ డిసెంబర్ లోనే థియేటర్లలోకి వస్తున్నాయి. దాంతో బాక్సాఫీస్ వార్ తప్పనట్లు కనిపిస్తోంది. అయితే విడుదల విషయాల్లో హీరోలు తొందరపడుతున్నారా? ఆ వివరాలు..

టాలీవుడ్ స్టార్ హీరోలు డిసెంబర్ ను టార్గెట్ చేసుకుని బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ లిస్ట్ లో మెుదటి ప్లేస్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 విడుదల తేదీ ప్రకటించినప్పుడు బన్నీకి సోలో రిలీజ్ దొరికిందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఈ నెలలో భారీ చిత్రాలు రాబోతున్నాయి. అయితే వాటికి కాస్త గ్యాప్ ఉండటం సంతోషించదగ్గ విషయం. అయితే నాగచైతన్య-చందు మెుండేటిల ‘తండేల్’, నితిన్ ‘రాబిన్ హుడ్’ ఒకే రోజున అంటే డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఇక లేటెస్ట్ గా శంకర్-రామ్ చరణ్ ల ‘గేమ్ ఛేంజర్’ కూడా క్రిస్మస్ కానుకగా రాబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. అదీకాక.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ను డిసెంబర్ లోనే తీసుకొస్తున్నానని మంచు విష్ణు ట్వీట్ చేసిన సంగతి తెలియనిది కాదు. వీటితో పాటుగా కీర్తి సురేష్-వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్, ముసాఫా ది లయన్ కింగ్, అమీర్ ఖాన్, జెనీలియాల సితారే జమీన్ పర్ క్రిస్మస్ కానుకగా విడుదల కానున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ జరగనుంది. అయితే ఇలా అన్ని సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఇండస్ట్రీకి అంతక మంచిది కాదన్నది సినీ పండితుల అభిప్రాయం. ఎందుకంటే? వరుసగా స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో.. ఏ మూవీ చూడాలో అర్థం కాదు. ఫ్యాన్స్ అయితే కంపల్సరి చూస్తారు అది వేరే విషయం.

కానీ సగటు సినీ ప్రేక్షకుడు వరుసగా సినిమాలు చూడాలంటే.. ఆర్థికంగా లెక్కలు వేసుకోవాల్సిందే. దాంతో ఎంపిక చేసుకున్న సినిమాలనే అతడు చూసే అవకాశం ఉంది. అదే వారం గ్యాప్ లో విడుదల చేస్తే.. వీకెండ్ కు ఒకటి చొప్పున అన్ని సినిమాలు చూసే ఛాన్స్ ప్రేక్షకుడికి కల్పించినట్లు అవుతుంది. అయితే నిన్నటి దాక గేమ్ ఛేంజర్ క్రిస్మస్ బరిలో లేదు. కానీ తాజాగా దిల్ రాజు ప్రకటనతో ఏ సినిమా మేకర్స్ అయినా వెనక్కి తగ్గుతారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇలా ఒకేసారి సినిమాలను రిలీజ్ చేయడంలో హీరోలు తొందరపడుతున్నారంటూ సినీ లవర్స్, పండితులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలా వరుసగా మూవీస్ విడుదల చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments