iDreamPost
android-app
ios-app

పోలీసుల చేతికి కీలక రిపోర్ట్.. దర్శన్ బయట పడటం కష్టమేనా?

  • Published Aug 07, 2024 | 9:24 PM Updated Updated Aug 07, 2024 | 9:24 PM

Renukaswamy Case: కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన రేణకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

Renukaswamy Case: కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన రేణకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

పోలీసుల చేతికి కీలక రిపోర్ట్.. దర్శన్ బయట పడటం కష్టమేనా?

కన్నడ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ హీరోగా దర్శన్ తూగుదీప తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్ లు పెడుతున్నాడన్న కారణంతో అతన్ని కిడ్నాప్ చేయించి అత్యంత దారుణంగా హింసించి హత్య చేయించాడు. ఆ సమయంలో దర్శన్, అతని ప్రియురాలు పవిత్రగౌడ కూడా ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 13 మంది నిందితులను పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శన్, పవిత్ర గౌడ చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో జూన్ 8న కన్నడ హీరో దర్శన్ తో పాటు అతని లవర్ పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ పరప్పర అగ్రహార జైలులో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఎవరికీ సాఫ్ట్ కార్నర్ చూపేది లేదని కర్ణాటక హూంశాఖ మంత్రి గంగాధరయ్య పరమేశ్వర అన్నారు. మరోవైపు వీరి ఫింగర్ ప్రింట్ రిపోర్టులు మ్యాచ్ అయినట్లు పోలీసులు తెలిపారు. రేణుకా స్వామి హత్య కేసులో ఏ1 గా పవిత్ర గౌడ్, ఏ2 గా దర్శన్, ఏ3 గా పవన్ అనే వ్యక్తి ఉన్నారు. తాజాగా ఈ కేసులో పోలీసులకు మరో కీలక రిపోర్ట్ చేతికి చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి.

హత్య కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ పోలీసులకు కొత్త సాక్ష్యంగా మారనుంది. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. హత్య అనంతరం దర్శన్ నివాసం నుంచి బ్లూ జీన్స్, నలుపు టీషర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిని పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్ కి పంపారు. ఆ బట్టపై ఉన్న రక్తపు మరకలు రేణుకా స్వామిదే అని తాజా నివేదికలో నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులకు ఇది బలమైన సాక్ష్యంగా ఉండబోతుందని అంటున్నారు. ఈ రిపోర్టుతో దర్శన్ చుట్టు మరింత ఉచ్చు బిగుస్తుందని అంటున్నారు. మరికొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అంటున్నారు.