nagidream
Chiranjeevi Invited For Balakrishna Golden Jubilee Celebrations: బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించాలని సినీ పరిశ్రమ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో సినీ పెద్దలు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆహ్వానం పలికారు.
Chiranjeevi Invited For Balakrishna Golden Jubilee Celebrations: బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించాలని సినీ పరిశ్రమ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో సినీ పెద్దలు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆహ్వానం పలికారు.
nagidream
నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు సెప్టెంబర్ 1న అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కాగా ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు సినీ పెద్దలు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ కి చెందిన సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆహ్వానం పలికారు. భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, రాజా రవీంద్ర, ప్రసన్న కుమార్, జెమినీ కిరణ్, అనుపం రెడ్డి, మాదాల రవి, కే.ఎల్. నారాయణ, నిర్మాతలు సి. కళ్యాణ్, అశోక్ కుమార్, దర్శకుడు వీరశంకర్, అనిల్ వల్లభనేని కలిసి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చిరంజీవిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై చిరంజీవి సానుకూలంగా స్పందించారు. స్వర్ణోత్సవ కార్యక్రమాల గురించి సినీ పెద్దలని అడిగి తెలుసుకున్నారు.
ఇక బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘తాతమ్మ కల’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా 1974వ సంవత్సరం ఆగస్టు 30న విడుదలైంది. ఈ నెల ఆగస్టు 30తో బాలకృష్ణ నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ వర్గం అంతా కలిసి స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1న అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆగస్టు 7న బుధవారం నాడు ఈ వేడుకకు సంబంధించిన పోస్టర్ కూడా లాంచ్ చేశారు. బాలకృష్ణ సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ చేతుల మీదుగా బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి బోయపాటి శ్రీను, తమ్మారెడ్డి భరద్వాజ, సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, కైకాల నాగేశ్వరరావు,, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 30తో బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. సినీ పరిశ్రమ అంతా కలిసి ఈ స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.