Keerthi
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ , దీపికా పదుకోన్ నటించిన ఫైటర్ మూవీ భారీ విజయం సాధించి కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలసిందే. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అదేప్పుడంటే..
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ , దీపికా పదుకోన్ నటించిన ఫైటర్ మూవీ భారీ విజయం సాధించి కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలసిందే. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అదేప్పుడంటే..
Keerthi
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ దీపికా పదుకోన్ నటించిన తాజా చిత్రం ‘ఫైటర్’. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కించారు. ఇందులో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. ఇక సినిమా గతనెల గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యాంలో దేశ భక్తిని జోడించి రూపొందించడంతో.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే.. ఫైటర్ ఇప్పటికి సుమారు రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో పాటు కాంట్రవర్సీల నడుమ తిరుగుతూ.. చివరికి ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. త్వరలో ఫైటర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఇంతకి అదేప్పుడంటే..
హృతిక్, దీపిక నటించిన ‘ఫైటర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే భారీ విజయానన్ని సాధించిన ఈ సినిమా గతకొన్ని రోజులగా ఓటీటీ రిలీజ్ కాబోతుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. అలాగే దీనిని నెట్ ఫ్లిక్స్ దాదాపు 75 కోట్ల రూపాయలు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫైటర్ మూవీ వచ్చే నెల 21 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. దీంతో హృతిక్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫైటర్ సినిమాల విషయంలో.. హృతిక్ చూట్టు కొన్ని వివాదులు చుట్టుముట్టాయి. ఎందుకంటే.. ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో ఉన్న హృతిక్ రోషన్, దీపికా మధ్య కొన్ని లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలపై విమర్శలతో పాటు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ విషయపై ఇదివరకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన అధికారి ఒకరు ఫైటర్ సినిమాకు లీగల్ నోటీసులు కూడా పంపిన విషయం తెలిసిందే.
ఇక ఫైటర్ సినిమాలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజిదా షేక్, అశుతోష్ రాణా, రిషబ్, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వయాకామ్ 18 స్టూడియోస్, మ్యాట్రిక్స్ పిక్చర్చ్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించాయి. అలాగే విశాల్ శేఖర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. మరి, త్వరలో ఫైటర్ మూవీ ఓటీటీలో విడుదల కాబోతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The Indian Air Force band’s powerfully rousing rendition of the #SpiritOfFighter theme echoes in the skies and makes our hearts soar. Truly an honour!#VandeMataram #Fighter@IAF_MCC pic.twitter.com/J3Hc1hAOp0
— Hrithik Roshan (@iHrithik) January 24, 2024