Swetha
రజిని కాంత్ హీరోగా .. ఐశ్వర్య రజిని కాంత్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం "లాల్ సలాం". ఈ సినిమా విడుదల అయ్యి రెండు రోజులు కూడా కాకుండానే.. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి పలు కథనాలు వినిపిస్తున్నాయి.
రజిని కాంత్ హీరోగా .. ఐశ్వర్య రజిని కాంత్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం "లాల్ సలాం". ఈ సినిమా విడుదల అయ్యి రెండు రోజులు కూడా కాకుండానే.. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి పలు కథనాలు వినిపిస్తున్నాయి.
Swetha
సూపర్ స్టార్ రజిని కాంత్ తాజాగా నటించిన చిత్రం “లాల్ సలామ్” ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. అలానే ఈ మూవీ ఎటువంటి టాక్ ను సంపాదించుకుందో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి గల కారణాలు కూడా అనేకం. విడుదలకు ముందు కూడా ఎటువంటి బజ్ లేకుండా .. అసలు సినిమా వచ్చిందా లేదా అన్న నేమ్ ను తెచ్చుకుంది “లాల్ సలాం”. ఇక థియేటర్ లో విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజిని కాంత్ “లాల్ సలాం” సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి కూడా .. పలు కథనాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది! ఈ మూవీ ఓటీటీ హక్కులను ఏ ఆన్ లైన్ ప్లాట్ ఫారం కైవసం చేసుకుంది అనే విషయాలను తెలుసుకుందాం.
రజిని కాంత్ లాల్ సలాం చిత్రాన్ని .. రజిని కాంత్ కూతురు “ఐశ్వర్య రజినీకాంత్” డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగానే రజినీకాంత్ సినిమాలంటే అందరికి చాలా ఎక్సపెక్టషన్స్ ఉంటాయి . ఇక అందులోను రజిని కూతురు ఐశ్వర్య .. స్వయంగా తన తండ్రి సినిమాకు దర్శకత్వం వహిస్తోంది అంటే .. అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ, ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో .. థియేటర్లలో రన్ అవుతోంది. అయితే, థియేటర్ లో అంతగా టాక్ సంపాదించుకోలేదు కాబట్టి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి, అయితే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు లాల్ సలాం ఓటీటీ ఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఈ చిత్రం ఓటీటీ పార్ట్నర్ ను , విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇక లాల్ సలాం సినిమా కథ విషయానికొస్తే.. ఒక ఊరిలో జరిగే హిందూ ముస్లిం గొడవలను ఉద్దేశించి .. తీసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో రజినీకాంత్ కు ఆ క్యారక్టర్ అంతగా సూట్ కాలేదని .. అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు. అయితే, ఈ సినిమాలో దాదాపు అందరూ.. ఎవరి క్యారక్టర్ కు వారు న్యాయం చేశారు. ఇక ఓటీటీలో విడుదల అయిన తర్వాత ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇక మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.