iDreamPost
android-app
ios-app

సంక్రాంతి బరిలో ఇంట్రెస్టింగ్ ఫైట్.. దీని వెనుక 23 ఏళ్ల కథ

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరో, హీరోయిన్లుగా ఎదిగారు.. అందులో కొద్దిమంద్రి మాత్రమే మంచి సక్సెస్ బాటలో నడిచారు.

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరో, హీరోయిన్లుగా ఎదిగారు.. అందులో కొద్దిమంద్రి మాత్రమే మంచి సక్సెస్ బాటలో నడిచారు.

సంక్రాంతి బరిలో ఇంట్రెస్టింగ్ ఫైట్.. దీని వెనుక 23 ఏళ్ల కథ

రోజులు ఎప్పుడూ ఒక్కలాగే ఉండిపోవు అన్నదానికి హనుమాన్ సినిమాయే ఒక ఉదాహరణ. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా. నిన్నటి బాలనటుటే నేటి హీరోలు అన్నది ఒప్పుకోవాల్సిన విషయం కూడా. రేపు పండక్కి రిలీజ్ కాబోతున్న హనుమాన్ చిత్ర కథానాయకుడు తేజా సజ్జా చిన్నప్పుడు దాదాపు అందరి హీరోలకి కొడుకుగా నటించాడు.  2000వ సంవత్సరంలో వై.వియస్ చౌదరి దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామక్రిష్ణ నిర్మించిన ‘యువరాజు’ చిత్రంలో హీరో మహేష్ బాబు కొడుకుగా నటించిన తేజా సజ్జా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో సజ్జ హీరోగా మారాడు. మహేష్ బాబుతో సంక్రాంతి పండగ రిలీజ్  విషయంలో ఫైట్ కి దిగడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. వివరాల్లోకి వెళితే..

మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం, తేజా సజ్జా నటించిన హనుమాన్ రెండూ సినిమాలు పండక్కి  తలపడబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఎఫెక్ట్ తో హనుమాన్ సినిమాకి సూపర్ క్రేజ్ వచ్చింది. ఇక మహేష్ బాబు సినిమా గుంటూరు కారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే  ఓ కొత్త జోనర్ లో ఉంటుందని అభిమానులు  అంటుంటారు.  పబ్లిక్ లోనూ కూడా చాలా ఇంటెన్స్ ఫాలోయింగ్ ఉంటుంది.   గతంలొ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2010 లో ఖలేజా వచ్చింది. అంతకు ముందు వాళ్ళ కాంబినేషన్లో అతడు వచ్చింది. అతడు మూవీ మహేష్ బాబు కెరీర్ తో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.

మహేష్ బాబు కెరీర్లో తను నటిస్తున్న 28 వ సినిమాగా గుంటూరు కారం రాబోతోంది. కాకపోతే ప్రారంభించిన వేళావిశేషం బాగులేనట్టుంది, గుంటూరు కారం ఘాటు మొత్తం సినిమాకి పట్టేసి, గొడవలు గొడవలుగా సినిమా పూర్తియింది. మొత్తానికి గుంటూరు కారం మూవీ మమా అనిపించేశారు. అభిమానులలో, ఇటు పరిశ్రమలో కూడా తేజా సజ్జా, మహేష్ బాబు మధ్యన సంక్రాంతి శుభసందర్భంలో పడనున్న పీటముడి చాలా ఆసక్తిరంగా మారింది. హనుమాన్ సినిమాకి ఉండాల్సిన క్రేజ్ దానికుండగా, గుంటూరు కారంకుండే మార్కెట్ దానికుంది. కాకపోతే ఇందులో థ్రిల్లింగ్ పాయంట్ ఏంటంటే ఒకనాటి ఫాదర్ అండ్ సన్ ఇప్పుడు సమఉజ్జీలుగా సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. అదీ అందరూ ఎంజాయ్ చేస్తున్న ధ్రిల్. రెండు సినిమాలు బాగా ఆడి, ఈ ధ్రిల్ కంటిన్యూ అవుతుందని ఆశిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి