iDreamPost
android-app
ios-app

Jr NTRతో సందీప్ రెడ్డి వంగ.. గుడ్ న్యూస్ వినబోతున్నామా?

  • Published Sep 09, 2024 | 12:52 PM Updated Updated Sep 09, 2024 | 12:52 PM

Jr NTR movie with Sandeep Reddy Vanga: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మీట్ అయ్యాడు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దాంతో త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందనే గుడ్ న్యూస్ వినబోతున్నామా? అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jr NTR movie with Sandeep Reddy Vanga: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మీట్ అయ్యాడు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దాంతో త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందనే గుడ్ న్యూస్ వినబోతున్నామా? అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Published Sep 09, 2024 | 12:52 PMUpdated Sep 09, 2024 | 12:52 PM
Jr NTRతో సందీప్ రెడ్డి వంగ.. గుడ్ న్యూస్ వినబోతున్నామా?

ఇండస్ట్రీలో పలానా హీరోతో పలానా డైెరెక్టర్ సినిమా పడితే ఉంటదిరా.. అంటూ ఫ్యాన్స్ కు కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కాంబినేషన్ లో మూవీ పడితే.. థియేటర్లు బద్దలు అవ్వడమే కాక, బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవుతాయని అభిమానులు సంబరపడిపోతూ ఉంటారు. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషనే జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. వీరిద్దరి కలయికలో ఓ సినిమా వస్తే చూడాలని తారక్ ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇందుకు సంబంధించి త్వరలోనే ఫ్యాన్స్ గుడ్ న్యూస్ వినబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 10న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఈ వేడుక కోసం తారక్ ముంబై రీచ్ అయ్యాడు. అక్కడే పలు కార్యక్రమాలతో పాటుగా బాలీవుడ్ మీడియాతో ఇంట్రాక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఒకరోజు ముందుగానే ముంబై చేరుకున్నాడు. ఈ క్రమంలో తారక్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి మాట్లాడుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో వీరి కాంబోలో ఓ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ గుడ్ న్యూస్ వినబోతున్నారు.. అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దేవర ప్రమోషన్స్ కోసం ముంబైకి వెళ్లిన తారక్ తో సందీప్ రెడ్డి భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అదీకాక వీరి కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అది త్వరలోనే నెరవేరబోతున్నట్లుగా కనిపిస్తోంది.

కాగా.. ప్రస్తుతం తారక్ వార్ 2, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా ప్రభాస్ తో స్పిరిట్, అలాగే బన్నీతో మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ తమ ప్రాజెక్ట్ లను కంప్లీట్ చేసుకున్న తర్వాత వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి గతంలోనే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అడుగులు కూడా వేసింది. తారక్ డేట్స్ ఆ నిర్మాణ సంస్థ దగ్గర ఉన్నాయని, సందీప్ రెడ్డి వంగ ఫ్రీ కాగానే చిత్రం ప్రారంభం అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ముంబైలో వీరిద్దరు కలవడంతో.. కచ్చితంగా ఈ సాలిడ్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని గట్టిగా చెబుతున్నారు నెటిజన్లు.

ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా మూడు పాటలు కూడా చాట్ బస్టర్ గా నిలిచాయి. అదీకాక ఇందులో యంగ్ టైగర్ ఊచకోత మామూలుగా ఉండదన్న టాక్ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగతో తారక్ మూవీ ఉండబోతుందన్న న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss