iDreamPost
android-app
ios-app

Ganesh Master: గణేష్‌ మాస్టర్‌ సీరియస్‌.. మనకు ఇంట్లో అమ్మలు ఉన్నారు కదా.. ఇలా చేస్తామా

  • Published Jul 31, 2024 | 10:11 AM Updated Updated Jul 31, 2024 | 11:53 AM

Ganesh Master Serious Comments-Dhee Latest Promo: ఢీ లేటెస్ట్‌ ప్రొమోలో గణేష్‌ మాస్టర్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఆ వివరాలు..

Ganesh Master Serious Comments-Dhee Latest Promo: ఢీ లేటెస్ట్‌ ప్రొమోలో గణేష్‌ మాస్టర్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఆ వివరాలు..

  • Published Jul 31, 2024 | 10:11 AMUpdated Jul 31, 2024 | 11:53 AM
Ganesh Master: గణేష్‌ మాస్టర్‌ సీరియస్‌.. మనకు ఇంట్లో అమ్మలు ఉన్నారు కదా.. ఇలా చేస్తామా

ఢీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి బుల్లి తెర మీద డ్యాన్స్‌ రియాలిటీ షోకు పెట్టింది పేరుగా మారింది. మిగతా చానెల్స్‌ ఇలాంటి డ్యాన్స్‌ రియాలిటీ షోలను ప్రారంభించినా.. అవేవి ఢీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాయి. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయడమే కాక.. కొత్త కొత్త ప్రతిభావంతులను వెండితెరకు పరిచయం చేస్తోంది. ఢీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారు ఇప్పుడు సినిమాల్లో కొరియోగ్రాఫర్‌లుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2 సీజన్‌ నడుస్తోంది. దీనిలో భాగంగా జూలై 31, ఆగస్టు 1న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ వారం ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ థీమ్‌తో డ్యాన్సర్లు అదరగొట్టే పర్ఫామెన్స్‌లు చేశారు. అయితే ఓ కంటెస్టెంట్‌ చేసిన డ్యాన్స్‌ మీద కొరియోగ్రాఫర్‌ గణేష్‌ మాస్టర్‌ సీరియస్‌ అయ్యారు. అమ్మతో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. ఆ వివరాలు..

ప్రొమోలో చూపించిన దాని ప్రకారం.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ థీమ్‌ కావడంతో.. కంటెస్టెంట్లు.. 90స్‌ పాటలకు డ్యాన్స్‌ చేశారు. దీనిలో భాగంగా ఓ కంటెస్టెంట్‌ అత్తో అత్తమ్మ కూతురో సాంగ్‌కి డ్యాన్స్‌ చేశాడు. సినిమాలోనే ఈ పాటపై అనేక అభ్యంతరాలు ఉండగా.. ఢీ షోలో కూడా కంటెస్టెంట్‌లు అదే తప్పులు చేశారు. అత్తను అమ్మగా భావించే సమాజం మనది. అలాంటిది ఆమెతో కలిసి చిందులు వేయడం.. పైగా చివర్లో సదరు కంటెస్టెంట్‌ అత్త క్యారెక్టర్‌ నోటి నుంచి ఆపిల్‌ తీసుకోవడం.. చూసేవారికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక గణేష్‌ మాస్టర్‌ కూడా ఇదే అంశంపై తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Ganesh Master

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఇంట్లో కూడా అమ్మలు ఉంటారు కదా.. అమ్మతో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా.. అంటూ సీరియస్‌ అయ్యారు. కొరియోగ్రాఫర్‌లందరికి చెబుతున్నాను.. ఇకపై ఎవరైనా ఇలా చేస్తే.. ఒక్క మార్కు కూడా ఇవ్వను అంటూ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు గణేష్‌ మాస్టర్‌. ఇక ఇదే ప్రొమోలో గణేష్‌ మాస్టార్‌ పండు మీద కూడా సీరియస్‌ అవ్వడం చూడవచ్చు. హైపర్‌ ఆది చేసిన కామెంట్స్‌ వల్ల గణేష్‌ మాస్టర్‌ ఇలా సీరియస్‌ కామెంట్స్‌ చేశారని ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. అసలేం జరిగిందో తెలియాలంటే.. ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యే వరకు ఎదురు చూడాలి.