iDreamPost
android-app
ios-app

గుంటూరు కారం మూవీలో పెద్ద తప్పు! OTTలోకి వచ్చాక వైరల్!

  • Published Feb 13, 2024 | 9:38 PM Updated Updated Feb 13, 2024 | 9:38 PM

Mahesh Babu Guntur Kaaram: మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం ప్రస్తుతం ఓటీటీని దున్నేస్తోంది. అయితే ఈ మూవీ ఫ్యాన్స్ ఒక పెద్ద తప్పును పట్టుకున్నారు.

Mahesh Babu Guntur Kaaram: మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం ప్రస్తుతం ఓటీటీని దున్నేస్తోంది. అయితే ఈ మూవీ ఫ్యాన్స్ ఒక పెద్ద తప్పును పట్టుకున్నారు.

  • Published Feb 13, 2024 | 9:38 PMUpdated Feb 13, 2024 | 9:38 PM
గుంటూరు కారం మూవీలో పెద్ద తప్పు! OTTలోకి వచ్చాక వైరల్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు– మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం గుంటూరు కారం. జనవరి 12న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కానీ, టాక్ తో సంబంధం లేకుండా మహేశ్ చరిష్మా, త్రివిక్రమ్ టేకింగ్ తో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే వచ్చాయి. మూవీ కూడా డీసెంట్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఇండియన్ మూవీస్ లో టాప్ 10లో గుంటూరు కారం కొనసాగుతోంది. అయితే ఓటీటీలోకి వచ్చాకి ఈ మూవీలో ఒక పెద్ద తప్పుని ప్రేక్షకులు కనిపెట్టారు.

గుంటూరు కారం కథ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భర్త, కొడుకుని వదిలేసి భార్య పుట్టింటికి వెళ్లిపోతుంది. అక్కడ ఆమెకు మరో పెళ్లి చేస్తారు. అతనికి ఒక కుమారుడు కూడా పుడతాడు. అతడిని ఆమెకు రాజకీయ వారసుడిని చేయాలి అని హీరో తాత తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకు హీరో అడ్డు రాకూడదు అని అతనితో ఒక సంతకం కూడా తీసుకుంటారు. ఈ మొత్తం జరిగే క్రమంలో చాలానే యాక్షన్ సీక్వెన్సులు, కామెడీ సీన్స్, సాంగ్స్ వస్తూ ఉంటాయి. తల్లిని వదులుకోలేక హీరో పడే తాపత్రయం అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. మరోవైపు హీరో తండ్రి ఇంట్లో కూర్చుని పాత గ్రామోఫోన్ లో పాత పాటలు వింటూ కిటికీ దగ్గర కూర్చుని రోడ్డువైపు చూస్తూ కూర్చుంటాడు. ఆ విషయంలో హీరో రమణ మాత్రం ఎంతో ఆసహనంతో ఉంటాడు.

ఎప్పుడూ నాన్నను ఏదో ఒక విషయంలో దెప్పుతూనే ఉంటాడు. అందులో భాగంగానే తండ్రి కిటికీ దగ్గర కూర్చునే విషయంపై కామెంట్స్ చేస్తాడు. “ఎప్పుడూ ఆ పాత పాటలు పెట్టుకుని.. ఆ కిటికీ వైపు చూస్తూ ఉంటాడు. పోనీ భార్య కోసం చూస్తున్నాడా అంటే? హైదరాబాద్ అటు లేదు. ఇటు ఉంది” అంటూ అసలు విషయాన్ని వెల్లడిస్తాడు. ఈ డైలాగ్ అందరికీ బాగా రిజిస్టర్ అవుతుంది. కానీ, క్లయిమ్యాక్స్ లో మాత్రం పెద్ద తప్పు చేసేశారు. ఎట్టకేలకు తల్లిని తీసుకుని రమణ ఇంటికి పయనమవుతాడు. తన కారులో తల్లితో కలిసి ఇంటికి వస్తుండగా.. తండ్రి కిటికీ లోనుంచి కారులో ఉన్న భార్య చీరను చూస్తాడు. తన భార్య ఇంటికి వస్తోంది అని తెలిసుకుంటాడు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. హైదరాబాద్ అటు లేదు అని హీరోతో చెప్పించారు. మళ్లీ హైదరాబాద్ లో ఉన్న తల్లిని తీసుకుని హీరో అదే కిటీకీ వైపు నుంచి ఇంటికి వస్తాడు. ఇదే విషయాన్ని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. థియేటర్లలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అందరూ ఈ విషయాన్ని నోటిస్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. అసలు అంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద డైలాగ్ పెట్టిన తర్వాత అదే రూట్ లో రావడం ఏంటి అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ కామెంట్స్, తప్పులు వెతకటాలు పక్కన పెడితే.. నెట్ ఫ్లిక్స్ లో సినిమా మాత్రం దూసుకుపోతోంది. ఈ మూవీ తర్వాత మరోసారి మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబో చూడబోతున్నాం అని చెబుతున్నారు. పాన్ ఇండియా సినిమా చేస్తానని త్రివిక్రమ్ కు మహేశ్ మాటిచ్చినట్లు వార్తలు వచ్చాయి. రాజమౌళి మూవీ తర్వాత ఆ ప్రాజెక్టు ఏమైనా పట్టాలెక్కుతుందేమో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet