iDreamPost
android-app
ios-app

నటి కాజల్ తో అభిమాని అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

  • Published Mar 06, 2024 | 1:41 PM Updated Updated Mar 06, 2024 | 1:41 PM

Fan Misbehaving With Kajal Agarwal: తాము ఎంతగానో అభిమానించే నటీనటులు ఎదురు పడితో అభినుల ఉత్సహాం పీక్ స్టేజ్ కి వెళ్తుంది.. అది ఒక్కోసారి సినీ తారలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి అనుభవం నటి కాజల్ కి ఎదురైంది... ఏం జరిగిందంటే..

Fan Misbehaving With Kajal Agarwal: తాము ఎంతగానో అభిమానించే నటీనటులు ఎదురు పడితో అభినుల ఉత్సహాం పీక్ స్టేజ్ కి వెళ్తుంది.. అది ఒక్కోసారి సినీ తారలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి అనుభవం నటి కాజల్ కి ఎదురైంది... ఏం జరిగిందంటే..

  • Published Mar 06, 2024 | 1:41 PMUpdated Mar 06, 2024 | 1:41 PM
నటి కాజల్ తో అభిమాని అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో, హీరోయిలు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాలకు కానీ, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి కానీ లేదా ఇతర పనులపై బయటికి వస్తే అక్కడ అభిమానులు చేసే సందడి మాములూగా ఉండదు. కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం వల్ల సినీ తారలు తెగ ఇబ్బందులు పడుతుంటారు. పోలీసులు  అభిమానులను కంట్రోల్ చేయడానికి నానా అవస్థలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అభిమానుల తాకిడి వల్ల ఒక్కోసారి సినీ తారలకు ప్రమాదాలు జరిగిన  సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన ప్రముఖ నటి కాజల్ కి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి మంగళవారం ప్రత్యేక అతిధిగా వెళ్లింది కలువకళ్ల కాజల్ అగర్వాల్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఫ్యాషన్ వస్త్ర సముదాయాన్ని ఆమె ప్రారంభించారు. అయితే ఓపెనింగ్ కార్యక్రమానికి నటి కాజల్ వస్తుందన్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కాజల్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అందరికీ నవ్వుతూ విష్ చేస్తూ ఉన్న కాజల్ కి ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. కాజల్ వద్దకు సెల్ఫీకోసం వెళ్లిన అభిమాని ఏకంగా ఆమె నడుంపై చేయి వేశాడు. దీంతో ఒక్కసారే షాక్ తిన్న కాజల్ వెంటనే పక్కకు నెట్టి ఏంటీది? అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

2007 లో డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లక్ష్మీ కల్యాణం మూవీలో కళ్యాన్ రామ్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వరుసగా స్టార్ హీల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. తేజ డైరెక్షన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీకి ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది. 2020 లో ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఈ జటకు ఒక మగబిడ్డ. ఇటీవల బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇండియన్ 2, ఉమా, సత్యభామ షూటింగ్ దశలో ఉన్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio