iDreamPost
android-app
ios-app

స్టార్ సింగర్ మంగ్లీకి ప్రమాదం.. ఏం జరిగిందంటే?

  • Published Mar 18, 2024 | 7:50 AM Updated Updated Mar 18, 2024 | 7:50 AM

జానపద గాయనిగా స్టార్ డమ్ సాధించి నేడు స్టార్ సింగర్ గా దూసుకెళ్తోంది గాయని మంగ్లీ. తాజాగా సింగర్ మంగ్లీ ప్రమాదానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

జానపద గాయనిగా స్టార్ డమ్ సాధించి నేడు స్టార్ సింగర్ గా దూసుకెళ్తోంది గాయని మంగ్లీ. తాజాగా సింగర్ మంగ్లీ ప్రమాదానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

  • Published Mar 18, 2024 | 7:50 AMUpdated Mar 18, 2024 | 7:50 AM
స్టార్ సింగర్ మంగ్లీకి ప్రమాదం.. ఏం జరిగిందంటే?

టీవీ షోల నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాల్లో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది గాయని మంగ్లీ. తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తుంది. అది ఫోక్ సాంగ్ అయినా సరే.. ఐటెం సాంగ్ ఐనా సరే మంగ్లీ పాడిందంటే చాలు ప్రేక్షకుల కేరింతలతో థియేటర్లు ఊగిపోవాల్సిందే. సింగర్ గా మారిన అనతి కాలంలోనే పాపులర్ గాయనిగా మారిపోయింది. వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఫేమస్ సింగర్ మంగ్లీ కారు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగించుకుని ఇంటికి బయలుదేరారు. అర్థరాత్రి సమయంలో మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి మంగ్లీ కారులో హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి పయనమయ్యారు. మార్గ మధ్యలో శంషాబాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వెనక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss