iDreamPost
android-app
ios-app

మహారాజా మూవీ పోలీస్ లో చాలా టాలెంట్ ఉంది…మీకు తెలుసా? ఫుల్ స్టోరీ!

  • Published Jul 17, 2024 | 8:28 PM Updated Updated Jul 26, 2024 | 12:24 PM

Natarajan Subramaniam Relation With Tollywood: మహారాజ సినిమా చూసిన వారికి సీఐగా చైసిన నటరాజన్ సుబ్రమణ్యం గురించి తెలిసే ఉంటుంది. అయితే ఆ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ కు త్రివిక్రమ్ కు ఉన్న సంబంధం గురించి మీకు తెలుసా?

Natarajan Subramaniam Relation With Tollywood: మహారాజ సినిమా చూసిన వారికి సీఐగా చైసిన నటరాజన్ సుబ్రమణ్యం గురించి తెలిసే ఉంటుంది. అయితే ఆ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ కు త్రివిక్రమ్ కు ఉన్న సంబంధం గురించి మీకు తెలుసా?

  • Published Jul 17, 2024 | 8:28 PMUpdated Jul 26, 2024 | 12:24 PM
మహారాజా మూవీ పోలీస్ లో చాలా టాలెంట్ ఉంది…మీకు తెలుసా? ఫుల్ స్టోరీ!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీల్లో ఆడియన్స్ ని తెగ మెప్పిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ట్విస్టులు, స్టోరీ, స్క్రీన్ ప్లేకి మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే ఈ మూవీలో అందరి యాక్టింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. ఇంక ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ బాగా వైరల్ అవుతోంది. అదే సీఐగా చేసిన సినిమాటోగ్రాఫర్- యాక్టర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం. అయితే ఆయనకు టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ ఒక కనెక్షన్ ఉందని మీకు తెలుసా? అలాగే నితిన్ తో కూడా నటరాజన్ సుబ్రహ్మణ్యం ఒక రిలేషన్ ఉంది అనే విషయం మీకు తెలుసా?

నటరాజన్ సుబ్రహ్మణ్యం ఒక బిజీ సినిమాటోగ్రాఫర్. తమిళ్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా అద్భుతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. 1999 నుంచి హిందీ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు. ఇప్పటికీ ఒక బిజీ సినిమాటోగ్రాఫర్ గా నటరాజన్ సుబ్రహ్మణ్యం కొనసాగుతున్నాడు. అలాగే 2002 నుంచి యాక్టర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 2002లో యూత్ నే సినిమాలో చిన్న పాత్ర చేశాడు. ఆ తర్వత మళ్లీ 2004లో యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మహారాజలాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో సీఐగా అలరించాడు. ఈ మూవీలో వచ్చే ట్విస్టుల్లో ఈ నటరాజన్ సుబ్రహ్మణ్యానికి కూడా భాగం ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు వైరల్ అవుతోంది.

నటరాజన్ సుబ్రహ్మణ్యంకు టాలీవుడ్ తో ఉన్న సంబంధం ఏటంటే సినిమాటోగ్రాఫర్ గా రెండు సినిమాలు చేశాడు. అతని మొదటి సినిమా త్రివిక్రమ్- నితిన్ కాంబోలో వచ్చిన ‘అఆ’ మూవీ. అతని టాలెంట్ ని గుర్తించి టాలీవుడ్ కి త్రివిక్రమ్ ఆహ్వానించాడు. అదే వారి మధ్య ఉన్న అసలు సిసలు రిలేషన్. అలాగే నితిన్ ఆ రిలేషన్ ని మరో కాంబోకి తీసుకెళ్లాడు. అతను చేసిన చల్ మోహనంరగ సినిమాకి కూడా నటరాజన్ సుబ్రహ్మణ్యంనే సినిమాటోగ్రాఫర్. ఆ విధంగా టాలీవుడ్ తో త్రివిక్రమ్- నితిన్ తో నటరాజన్ సుబ్రహ్మణ్యంకు మంచి రిలేషన్ ఉంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్ తెలుగులో సినిమా చేయలేదు. ఈయన ఎక్కువ బాలీవుడ్, తమిళ్ ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడుపుతూ ఉంటాడు. నటుడిగా కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా గడిపేస్తున్నాడు. అందుకే మళ్లీ టాలీవుడ్ వైపు చూసినట్లు లేడు. ఇంక ఈయన ఒక వెబ్ సిరీస్ కూడా చేశాడు. విక్టిమ్ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటరాజన్ సుబ్రహ్మణ్యం కనిపించాడు.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş