Keerthi
చాలామంది సినిమాల మీద ఉనన్ పిచ్చితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారు. అలా వెండితెర పై అడుగుపెట్టిన వారు భవిష్యత్తులో స్టార్స్ గా ఎదగాలని కోరుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతారు. కానీ ఈ మహిళ మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
చాలామంది సినిమాల మీద ఉనన్ పిచ్చితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారు. అలా వెండితెర పై అడుగుపెట్టిన వారు భవిష్యత్తులో స్టార్స్ గా ఎదగాలని కోరుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతారు. కానీ ఈ మహిళ మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Keerthi
చాలామంది నటన మీద ఉన్న ఆసక్తితో వెండితెర పై అడుగు పెడతారు. ఈ క్రమంలోనే కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో ఎంతోమంది తాము భవిష్యత్తులో స్టార్ స్టేటస్ లను సంపాదించుకోవాలని తపన పడుతుంటారు. మరి కొందరు మాత్రం కొన్నాళ్లు వెండితెర పై మెరిసి.. ఆ తర్వాత తమ కెరీర్ పై దృష్టి పెడుతుంటారు. కానీ, ప్రస్తుత కాలంలో సినిమాల మీద పిచ్చితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినవాళ్లను చూశాం. అలాగే ఇండస్ట్రీలో అవకాశాల లేకపోవడంతో.. ఆ అవకాశాల కోసం రోడ్లపై తిరిగే వాళ్లని చూశాం. అయితే ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈమె ఒక అప్పుడు చైల్డ్ అర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ, ఇప్పుడు ఆమె చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఆమె ఎవరంటే..
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగానే తమ కెరీర్ ను ప్రారంభించి ఇప్పడు ఇండస్ట్రీలో హీరో, హరోయిన్ లుగా కొనసాగుతన్నారు. కానీ, పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి మాత్రం అందుకు భిన్నంగానే ఉంటుంది. ఆవిడే హెచ్ఎస్ ‘కీర్తన’. ఈమె గురించి ఇప్పటి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. ఎందుకంటే.. ఈమె ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అటు బుల్లితెర నుంచి ఇటు వెండితెర పై తన నటనతో అందరినీ కట్టిపడేసింది. అలాగే అనేక కన్నడ సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేసింది. అయితే, అలా సినిమాల్లో అలారిస్తున్న ఈమెకు రానురాను నటన పై ఆసక్తి తగ్గింది. ఈ క్రమంలోనే తనకు చదువు పై మక్కువ ఎక్కువైంది. ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలనుకుంది.అలాగే ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం యూపీఎస్సీ ఎగ్జామ్ రాయగా.. పరీక్షల్లో ఫెయిలైంది. అయినా తన పట్టు విడవకుండా.. ధైర్యంగా ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే వరుసగా పరీక్షలు రాస్తూనే ఉంది. అలా ఆరోసారి (2020)లో పరీక్షల్లో ఉత్తిర్ణత సాధించింది. కాగా, ఆలిండియా లెవల్ లోని 167వ ర్యాంకు సంపాదించింది. ఇక కర్ణాటకలోని మాండ్యా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గా నియమకమైయింది.
అయితే దీనికంటే ముందు కీర్తన 2011లో ఆమె కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్ (కేఎస్) కూడా రాసింది. ఇక ఈ పరీక్షల్లో కూడా ఆమె పాస్ అవడంతో పాటు ఉద్యోగం కూడా సాధించింది. అలా రెండేళ్లపాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా తన సేవలందించింది. ఆ తర్వాత.. ఐఏఎస్ గా ఉద్యోగం సాధించి కీర్తిన.. తన ఘన కీర్తిని చాటి చెప్పింది. కాగా, మొదటి ప్రయత్నంలో ఫెయిలయ్యామని నిరాశతో కృంగిపోకుండా ఇంతటి విజయాన్ని సాధించిన కీర్తన ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకం మారింది.
ఇక కీర్తన.. ‘కర్పూరద’, ‘గోంబే’, ‘గంగ-యమున’, ‘ముద్దిన అలియ’, ‘ఉపేంద్ర’, ‘ఎ, కనూర్ హెగ్గడటి’, ‘సర్కిల్ ఇన్ స్పెక్టర్’, ‘ఓ మల్లిగె’, ‘లేడీ కమిషనర్’, ‘హబ్బ’, ‘డోరె’, ‘సింహాద్రి’, ‘జనని’, ‘చిగురు’, ‘పుతని ఏజెంట్’ వంటి పలు చిత్రాల్లో బాలానటిగా నటించి మెప్పించింది.మరి, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కీర్తన ఇప్పుడు ఐఏఎస్ గా ప్రజలకు సేవ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.