iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమాలో నితిన్‌, శ్రీలీల జంటగా నటించారు. ఈ మూవీ డిసెంబర్‌ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీకి సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమాలో నితిన్‌, శ్రీలీల జంటగా నటించారు. ఈ మూవీ డిసెంబర్‌ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీకి సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..

ఓటీటీలోకి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌.. ఎప్పుడు? ఎక్కడంటే..

నితిన్‌ తాజాగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం డిసెంబర్‌ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మంచి రివ్యూలు రాబట్టింది. కలెక్షన్ల పరంగా కూడా పర్లేదు అనిపించుకుంది. చాలా కాలంగా హిట్లు లేకుండా ఇబ్బంది పడుతున్న నితిన్‌కు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ప్లస్‌ అయింది. ఫెయిల్యూర్ల నుంచి బయటకు తీసుకువచ్చింది.

ఇక, ఈ సినిమా ఓటీటీకి సంబంధించి కొన్ని వార్తలు సోషల్‌ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ జనవరి మొదటి వారం కానీ, సంక్రాంతి కానుకగా కానీ, ఓటీటీలోకి రానుందట. ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్లు.. నిర్మాణ సంస్థతో టచ్‌లో ఉన్నారట. ఓటీటీ హక్కుల కోసం సంప్రదిస్తూ ఉన్నారట. ఈ రెండు సంస్థల్లో ఏదో ఒకటి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కుల్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ వారంలో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్‌ వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.

extrordinary man movie in ott

కాగా, ఈ మూవీలో నితిన్‌కు జంటగా శ్రీలీల నటించారు. రాజశేఖర్‌, పవిత్రా లోకేష్‌, రావు రామేష్‌, సుదేవ్‌ నాయర్‌, హర్షవర్థన్‌, సంపత్‌ రాజ్‌, బ్రహ్మాజీ, అజయ్‌లు కీలక పాత్రల్లో నటించారు. నితిన్‌ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. వక్కంతం వంశీ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందించారు. సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా షూటింగ్‌ కేవలం 60 రోజుల్లోనే పూర్తయింది.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమా కథ ఏంటంటే.. 

అభి( నితిన్‌) తెలుగు చిత్రం పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా పెద్ద స్టార్‌ అవ్వాలనేది అతడికి కల. అయితే, మధ్య తరగతి కుటుంబ పరిస్థితులు అతడ్ని అన్ని విధాలుగా సినిమా వైపు వెళ్లనీయకుండా ఆపుతూ ఉంటాయి. ముఖ్యంగా తండ్రి అభిని ప్రతీసారి తిడుతూ ఉంటాడు. ఉద్యోగం చేయమని ఒత్తిడి తెస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తండ్రి పోరు పడలేక అభి ఉద్యోగ వేటోలో పడతాడు. లిఖిత(శ్రీలీల) కారణంగా అభికి ఓ మంచి ఉద్యోగం వస్తుంది. అభి ఆ ఉద్యోగంలో చేరతాడు. అయితే, ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకు అతడి ఓ సినిమా ఆఫర్‌ వస్తుంది. అభిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని ఓ డైరక్టర్‌ మాటిస్తాడు. ఆ మూవీ కారణంగా అభి జీవితం ఎలా మారిందనేది మిగిలిన కథ.