iDreamPost
android-app
ios-app

Pooja Hegde ఎఫ్3 కోసం పూజా గ్లామర్

  • Published Apr 15, 2022 | 4:14 PM Updated Updated Apr 15, 2022 | 4:14 PM
  • Published Apr 15, 2022 | 4:14 PMUpdated Apr 15, 2022 | 4:14 PM
Pooja Hegde ఎఫ్3 కోసం పూజా గ్లామర్

‘హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఐటెం లేదా స్పెషల్ సాంగ్స్ చేయడం అరుదు. కానీ పూజా హెగ్డే అలాంటి మొహమాటాలు ఏమి పెట్టుకోలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సీక్వెల్ గా రూపొందుతున్న ఎఫ్3లో ఒక పాటలో తన గ్లామర్ పంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు హైదరాబాద్ లో షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇందులో తను ఒక్కర్తే కాదు వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్, సోనాలి చౌహన్ తో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రకాష్ వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో దీని షూట్ జరుగుతోంది. ఇంకో రెండు మూడు రోజుల్లో పూర్తి చేసేస్తారు.

ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఎఫ్3 కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వెంకటేష్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి చాలా గ్యాప్ వచ్చేసింది. నారప్ప, దృశ్యం 2లు ఓటిటి బాట పట్టడంతో తమ హీరోని స్క్రీన్ మీద మిస్ అయ్యామనే ఫీలింగ్ వాళ్లలో బలంగా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఎఫ్3కి ఇప్పుడు పూజా గ్లామర్ ఖచ్చితంగా అదనపు ఆకర్షణ అవుతుంది. గత కొన్నేళ్లుగా ఫ్లాప్ లేకుండా కొనసాగుతున్న పూజా హెగ్డేకు ఆ మధ్య విడుదలైన రాధే శ్యామ్ ఫలితం మింగుడు పడటం లేదు. చాలా కష్టపడి చేసి ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది డిజాస్టర్ కావడం ఊహించనిది. ఇది చాలదు అన్నట్టు ఇటీవలే మరో షాక్.

విజయ్ తో బీస్ట్ తమిళంలో బలమైన మార్కెట్ ఇస్తుందనుకుంటే అది కూడా ఫ్లాప్ కావడం పెద్ద ట్విస్టు. కంటెంట్ ఎలా ఉన్నా తన ఇమేజ్ లాక్కొచ్చే తలపతి సైతం నిస్సహాయంగా మిగిలిపోయాడు. దానికి తోడు కెజిఎఫ్ 2 దెబ్బ కోలుకోలేని విధంగా చేస్తోంది. అందుకే పూజా హెగ్డే నెక్స్ట్ చేయబోయే సినిమాల మీద సీరియస్ దృష్టి పెడుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ మళ్ళీ ఫామ్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి. ఇక ఎఫ్3 సంగతికొస్తే మే 27 విడుదలకు రెడీ అవుతోంది. అదే రోజు మేజర్ ఉన్నప్పటికీ ఈ క్లాష్ ఉంటుందా లేదా క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş