iDreamPost
android-app
ios-app

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ నగరానికి ఏమైంది యాడ్ చిన్నారి!

  • Author Soma Sekhar Updated - 06:56 PM, Fri - 4 August 23
  • Author Soma Sekhar Updated - 06:56 PM, Fri - 4 August 23
హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ నగరానికి ఏమైంది యాడ్ చిన్నారి!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోలుగా, హీరోయిన్ లుగా వెలుగొందుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే టీవీ యాడ్స్ లో నటించి.. వెండితెరపైకి అడుగుపెట్టిన వారు మాత్రం చాలా అరుదనే చెప్పుకోవాలి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో టీవీ యాడ్స్ లో నటించిన కృతి శెట్టి ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇప్పుడు ఇదే కోవలోకి చేరబోతోంది మరో చైల్డ్ ఆర్టిస్ట్. మనందరికి సుపరిచితమైన ఓ ఫేమస్ యాడ్ లో నటించిన చిన్నారి త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అవును సినిమా థియేటర్లలో ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు పొగ.. మరోవైపు నుసి. ఎవ్వరూ నోరు మెదపరే! అంటూ ఓ వచ్చే యాడ్ ను చూడని ప్రేక్షకుడంటూ లేడు. ఆ యాడ్ లో అమాయకంగా నటించిన చిన్నారి త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందట.

బుల్లితెరపై వెండితెరపై మనం ఎన్నో యాడ్స్ చూసుంటాం. కానీ అందులో కొన్ని మాత్రమే మనకు గుర్తుంటాయి. అలా అందరి మైండ్ లో గుర్తున్న యాడ్ ఏదైనా ఉందంటే అది.. సినిమా పడే ముందు వచ్చే ధూమపానం యాడ్ అనే చెప్పాలి. అంతలా ఆ యాడ్ మన మైండ్ లో ఫిక్స్ అయ్యింది. సినిమా పడే ముందు ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు పొగ.. మరోవైపు నుసి.. ఎవ్వరూ నోరు మెదపరేంటి? అంటూ ఒక యాడ్ వస్తుంది. ఇక ఈ యాడ్ లో సిగరెట్ తాగుతున్న తండ్రి వద్దకు అమయాకంగా వస్తుంది చిన్నారి. దాంతో తన చేతిలో ఉన్న సిగరెట్ ను కిందపడేస్తాడు ఆ తండ్రి. ఈ యాడ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక ఈ యాడ్ లో అమయకంగా ఎంతో అద్భుతంగా నటించిన చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్. 1997 లో ముంబైలో జన్మించిన ఈమె.. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 150కి పైగా యాడ్స్ లో నటించింది సిమ్రాన్ నటేకర్. ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో పూజా పాత్రలో కనిపించింది సిమ్రాన్. హిందీలో పలు సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇప్పటి వరకు చిన్నా చితక పాత్రలు చేసిన ఈ భామ.. త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆరాపడుతోందట. అందుకే సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అదీకాక తెలుగులో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లతో ఆడిషన్స్ కూడా ప్లాన్ చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్నీ కుదిరితే త్వరలోనే తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది సిమ్రాన్ నటేకర్. ప్రస్తుతం ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫుల్ పాలోయింగ్ ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Simran Natekar (@simran.natekar)


ఇదికూడా చదవండి: పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్! అఫీషియల్ గా ప్రకటించిన బ్యూటి..

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel