iDreamPost

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్! అఫీషియల్ గా ప్రకటించిన బ్యూటి..

  • Author Soma Sekhar Published - 04:10 PM, Fri - 4 August 23
  • Author Soma Sekhar Published - 04:10 PM, Fri - 4 August 23
పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్! అఫీషియల్ గా ప్రకటించిన బ్యూటి..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏ విషయాన్నైనా అందరూ సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే.. వారు ఏ చిన్న వేడుక లేదా సంతోషకరమైన వార్తను తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సెలబ్రిటీలు ఎక్కువగా తమ పెళ్లి విషయాలను ఇందులో తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఓ ప్రముఖ హీరోయిన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. మరి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్న ఆ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మాళవిక రాజ్.. 2001లో వచ్చిన కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పూజా పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘K3G’ అనే మూవీలో కరీనా కపూర్ ఖాన్ పాత్రను పోషించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన జయదేవ్ సినిమాలో కూడా కనిపించింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన మాళవిక పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తనక కాబోయే భర్తను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రముఖ వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాతో మూడు ముళ్ల బంధంలోకి త్వరలోనే అడుగుపెట్టనున్నట్లు తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా అఫీషియల్ గా వెల్లడించింది.

ఈ క్రమంలోనే ప్రణవ్-మాళవిక జంటగా టర్కీలో దిగిన ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. ఫోటోలకు జతగా ఇలా రాసుకొచ్చింది మాళవిక..”చాలా కాలం తర్వాత మాకు సమయం చిక్కింది. మేము త్వరలోనే కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ బంధంతో మేము ఇంకా బలంగా తయ్యారౌతాం ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది మాళవిక రాజ్. కాగా.. మాళవిక ప్రముఖ బాలీవుడ్ నటుడు జగదీశ్ రాజ్ మనవరాలు, బాబీ రాజ్ కుమార్తె కావడం గమనార్హం. అయితే పెళ్లి డేట్ మాత్రం వెల్లడించలేదు మాళవిక-ప్రణవ్ లు. ఇక త్వరలోనే పెళ్లితో ఒక్కటి కాబోతున్న ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పలువురు నటులు, అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Malvika Raaj (@malvikaraaj)


ఇదికూడా చదవండి: ఓటిటిలోకి రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి