iDreamPost
android-app
ios-app

‘ఈగల్‌’పై తప్పుడు వార్తలు.. స్పందించిన సినిమా టీం!

  • Published Nov 01, 2023 | 4:11 PM Updated Updated Nov 01, 2023 | 4:11 PM

నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Published Nov 01, 2023 | 4:11 PMUpdated Nov 01, 2023 | 4:11 PM
‘ఈగల్‌’పై తప్పుడు వార్తలు.. స్పందించిన సినిమా టీం!

రవితేజ హీరోగా.. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్‌’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ లేడీ లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా 2024 జనవరి 12 విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమచారం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టైటిల్‌ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో గత కొద్ది రోజుల నుంచి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంపై సినిమా టీం తాజాగా స్పందించింది. ఈగల్‌ సినిమా సంక్రాంతికి రాదు అన్న ప్రచారాన్ని సినిమా టీం కొట్టి పారేసింది. అదంతా తప్పుడు ప్రచారమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈగల్‌ సినిమా సంక్రాంతికి రాదు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని సినిమా టీం పేర్కొంది.

తప్పుడు ప్రచారాలు చేసే వారికి, వార్తలు రాసే వారికి.. థియేటర్‌ అగ్రిమెంట్‌ చూపిస్తామంటూ సినిమా యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈగల్‌ సినిమా విడుదలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు తెరపడినట్లు అయింది. కాగా, రవితేజ నటించిన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. కేవలం తెలుగులోనే కాదు.. విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు మంచి స్పందన వచ్చింది. మరి, ఈగల్‌ సినిమా విడుదలపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సినిమా టీం క్లారిటీ  ఇవ్వటంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom