iDreamPost
android-app
ios-app

Eagle : అదిరిపోయే విజువల్స్ తో ‘ఈగిల్’ మేకింగ్ వీడియో

  • Published Feb 06, 2024 | 12:09 PM Updated Updated Feb 06, 2024 | 12:09 PM

మాస్ మహారాజ్ రవితేజ నటిచింన తాజా చిత్రం "ఈగల్". ఈ చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

మాస్ మహారాజ్ రవితేజ నటిచింన తాజా చిత్రం "ఈగల్". ఈ చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

  • Published Feb 06, 2024 | 12:09 PMUpdated Feb 06, 2024 | 12:09 PM
Eagle : అదిరిపోయే విజువల్స్ తో  ‘ఈగిల్’ మేకింగ్ వీడియో

టాలీవుడ్ ఇండస్ట్రీని ఎప్పటినుంచో ఏలుతున్న కొంతమంది ప్రముఖ హీరోలలో.. రవి తేజ ఒకరు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సినిమాలాలోకి అడుగుపెట్టి .. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ.. మాస్ మహారాజ్ రవి తేజ గా ఇండస్ట్రీలో నిలిచిపోయారు. ఎదో సినిమాలో ఈ హీరో చెప్పినట్టుగానే.. సినిమా హిట్ అయినా మరో సినిమా తీయాలి .. సినిమా ప్లాప్ అయినా మరో సినిమా తీయాలి అన్నట్లు.. హిట్లు , ప్లాపులు తో సంబంధం లేకుండా.. ప్రతిసారి ఎదో ఒక కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు రవితేజ. ఈ క్రమంలోనే రవితేజ తాజాగా నటించిన చిత్రం “ఈగల్”. ఈ సినిమా సంక్రాంతి సమయానికే విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని విషయాల కారణంగా .. సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకుని.. ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈగల్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.

మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న “ఈగల్” చిత్రంపైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలానే, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల ముఖ్య పాత్రలలో నటించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , విజువల్స్ అన్నీ కూడా “ఈగల్” సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. సంక్రాంతికి విడుదల చేయాల్సిన ఈ చిత్రాన్ని.. పోస్ట్ పోన్ చేసుకుని ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చిత్ర బృందం.. మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. మూవీ టీం అంతా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. అలాగే అటు సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి భారీగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఒక ఫంక్షన్ లో ఓ యువకుడు రవితేజ గురించి పాడిన ర్యాప్ సాంగ్ కూడా .. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు విడుదల చేసిన మూవీ మేకింగ్ వీడియో కూడా.. “ఈగల్” పై ఇంకాస్త ఆసక్తిని కలిగించే విధంగా ఉంది.

కాబట్టి, ఒక రకంగా రవి తేజ ఈ సినిమాతో అభిమానులకు.. మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించేలా ఉన్నాడని చెప్పి తీరాలి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో పాజిటివ్ టాక్ వినిపిస్తోన్న “ఈగల్” .. థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇక రవి తేజ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పైన కూడా .. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ తరువాత డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. మరి, ఫిబ్రవరి 9న విడుదుల కాబోతున్న “ఈగల్” మూవీ మేకింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş