iDreamPost
android-app
ios-app

ట్రైలర్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ! ఒక గండం తప్పినట్టేనా?

డిసెంబర్ చివరిలో క్రిస్ మస్ కాకుండా మరో పండుగ వస్తోంది. అదీ కూడా మామూలు ఫెస్టివల్ కాదూ.. సినిమా పండుగ. రెండు బడా మూవీస్ డిసెంబర్ మంత్ ఎండింగ్ లో థియేటర్లను దద్దరిల్లించేందుకు సిద్ధమౌతున్నాయి. అవే డంకీ, సలార్. ఒక్క రోజు తేడాతో ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే..

డిసెంబర్ చివరిలో క్రిస్ మస్ కాకుండా మరో పండుగ వస్తోంది. అదీ కూడా మామూలు ఫెస్టివల్ కాదూ.. సినిమా పండుగ. రెండు బడా మూవీస్ డిసెంబర్ మంత్ ఎండింగ్ లో థియేటర్లను దద్దరిల్లించేందుకు సిద్ధమౌతున్నాయి. అవే డంకీ, సలార్. ఒక్క రోజు తేడాతో ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే..

ట్రైలర్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ! ఒక గండం తప్పినట్టేనా?

ఈ డిసెంబర్‌లో భారీ బడ్జెట్ మూవీస్ సందడి చేస్తున్నాయి.. చేయబోతున్నాయి. డిసెంబర్ 1న విడుదలైన పాన్ ఇండియా మూవీ యానిమల్ కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక మంత్ చివరిలో బాక్సాఫీసును షేక్ చేసేందుకు వస్తున్నాయి రెండు బడా ప్రాజెక్టులు. అవే డంకీ, సలార్-ద సీజ్ ఫైర్. ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్లతో జోరు మీదున్న షారుఖ్ ఖాన్ నుండి రాబోతున్న మరో చిత్రం డంకీ. అలాగే డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూవీ సలార్. ఒక్క రోజు తేడాతో థియేటర్ల వద్ద పోటీ పడుతున్నాయి. డిసెంబర్ 21న డంకీ విడుదల అవుతుండగా.. మరుసటి రోజు అనగా 22వ తేదీన సందడి చేసేందుకు రాబోతుంది సలార్. అయితే ఈమూవీ ట్రైలర్స్ విడుదలై.. ట్రెమండస్ రెస్పాన్స్ అందుకున్నాయి.

కేజీఎఫ్ సిరీస్‌ల దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్వయంలో తెరకెక్కిన సలార్ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. యూట్యూబ్ ను రప్ఫాడించింది ఈ వీడియో. 24 గంటలు గడవక ముందే.. 100 మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. ఆకలి మీద ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఈ ట్రైలర్ చూసి బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్నాళ్ల నుండి ఇలాగే కదా ప్రభాస్ ను చూడాలని వెయిట్ చేస్తున్నది అనుకున్నారు. అలాగే షారూఖ్ డంకీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‪ను తాజాగా విడుదల చేసింది. చాలా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ టూ మూవీస్ బాక్సాఫీసు వద్ద ఒక్క రోజు తేడా బరిలోకి దిగడంతో టెన్షన్‌తో బతుకుతున్న ఫ్యాన్స్‌కు ట్రైలర్లు చూశాక మనస్సు కుదుట పడిందని చెప్పొచ్చు.

ఎందుకంటే.. డంకీలో కూడా మాస్ ఎలివేషన్ ఉందనుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే అలా లేదు. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. ఇక సలార్ ఫుల్ మాస్ రంగు పులుముకొని కనిపిస్తుంది. డంకీ మూవీ విషయంలో తన పాత పంథానే అనుసరించాడు రాజ్ కుమార్ హిరానీ. బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకరైన ఆయన.. గతంలో తీసిన చిత్రాల మాదిరిగానే ఈ మూవీని కూడా సాఫీగా సాగిపోయేట్టుగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే హిరానీ నుండి ఐదేళ్ల తర్వాత రాబోతున్న మూవీ ఇదే. తొలుత ఈ మూవీ కూడా డిసెంబర్ 22 నే రిలీజ్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ తేదీని 21కి జరుపుకున్నారు. ఇక సలార్ గురించి చెప్పనక్కర్లేదు. మూవీ ఎనౌన్స్ చేసిన నాటి నుండే హయ్యర్ ఎక్ట్ పక్టేషన్స్ మొదలయ్యాయి. అయితే పలుమార్లు వాయిదా పడిన సలార్ కూడా డిసెంబర్ బరిలో దిగింది.

ఇద్దరు స్టార్లు థియేటర్లలో పోరుకు సిద్ధమౌతుంటే.. భయపడ్డారు అభిమానులు. ఇది ఇండస్ట్రీకి మంచిది కాదనుకున్నారు కొంత మంది. కానీ ఇద్దరు వెనక్కు తగ్గలేదు. అయితే ఇప్పుడు విడుదలైన ట్రైలర్స్ చూశాక.. రెండు డిఫరెంట్ జోన్‌ చిత్రాలుగా కనిపిస్తున్నాయి. పఠాన్, జవాన్‌లో మాస్ జాతర చేసిన షారూఖ్.. ఈ మూవీ క్లాస్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మామూలుగా రెండు మాస్ సినిమాలు.. థియేటర్లలో పోటీ పడితే.. ఏదీ చూడాలో, ఏదీ హిట్ అవుతుందోనని కాస్త టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సారి అలా ఏమీ కనిపించడం లేదు. ఒకరు మాస్, మరొకరు క్లాస్ మూవీస్‌తో బాక్సాఫీసు బరిలోకి దిగుతున్నారు. దీంతో ప్రభాస్ కలెక్షన్లకు ఏ మాత్రం ఢోకా ఉందని భావిస్తున్నారు. దీంతో పెద్ద గండమే తప్పినట్లు అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.


Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabet