Venkateswarlu
వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కన్నడ స్టార్ హీరో దునియా విజయ్. ఒక్క సినిమాతోటే తెలుగులో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు.
వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కన్నడ స్టార్ హీరో దునియా విజయ్. ఒక్క సినిమాతోటే తెలుగులో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు.
Venkateswarlu
కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమాతో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా విలన్‌గా నటించారు. ఎంట్రీనే అదరగొట్టారు. హీరో బాలకృష్ణతో పోటాపోటీగా నటించారు. వీరసింహారెడ్డిలో విజయ్ నటనకు మాస్ ఆడియన్స్ ఉర్రూతలూగిపోయారు.
ఇక, అసలు విషయానికి వస్తే.. దునియా విజయ్ తన మంచి తనాన్ని చాటుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆరుగురు ఖైదీలకు విముక్తి కలిగించారు. పుట్టిన రోజును గ్రామంలో జరుపుకోవాలని ఆయన భావించారు. ఈ నేపథ్యంలోనే దునియా విజయ్ తన స్వగ్రామంలో పర్యటించారు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపారు. స్థానికులతో చిన్న నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తర్వాత కుంబరహళ్లిలోని కొన్ని కుటుంబాలకు చెందిన వారు జైలుకు వెళ్లారని తెలిసి అక్కడికి వెళ్లారు.
వారు తమ వాళ్లను రిలీజ్ చేయించాలని విజయ్‌ని కోరారు. విజయ్ ఇందుకు సానుకూలంగా స్పందించారు. తన లాయర్లతో మాట్లాడి వారందరినీ బయటకు విడిపించారు. అంతేకాదు! స్వయంగా ఆయనే జైలుకు వెళ్లారు. అక్కడ కొంతమంది ఖైదీలతో ముచ్చటించారు. వారికష్టనష్టాలు తెలుసుకున్నారు. జరిమానా చెల్లిస్తే విడుదల చేసే అవకాశం ఉన్న 62 మంది ఖైదీలను విడుదల చేయించారు. సొంతూరు కుంబరహళ్లికి చెందిన 6 గురి పరిస్థితి కూడా అదే.
కాగా, దునియా విజయ్ 2004లో వచ్చిన రంగ ఎస్‌ఎస్‌ఎల్‌సీ మూవీతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించారు. తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో పాటు.. ఫ్రెండ్స్, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు. 2007లో వచ్చిన దునియా సినిమాతో హీరోగా మారారు. మొదటి సినిమాతోటే హీరోగా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2021లో వచ్చిన సాలగ అనే మూవీతో హీరోగా మారారు. మొదటి డైరెక్టరల్ డెబ్యూట్‌తోనే హిట్‌ను అందుకున్నారు.
ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా తన సత్తా చాటుతున్నారు. మరి, పుట్టిన రోజు సందర్భంగా దునియా విజయ్ 62 మంది ఖైదీలను జైలు నుంచి విడిపించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.