Dulquer Salmaan New Movie With Allu Aravind: తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్​లో దుల్కర్ సల్మాన్.. ఇది ఊహించని కాంబో!

Dulquer Salmaan: తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్​లో దుల్కర్ సల్మాన్.. ఇది ఊహించని కాంబో!

మలయాళ సూపర్​స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మరింత బిజీ అవుతున్నారు. టాలీవుడ్​లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను ఆయన ఓకే చేస్తున్నారు.

మలయాళ సూపర్​స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మరింత బిజీ అవుతున్నారు. టాలీవుడ్​లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను ఆయన ఓకే చేస్తున్నారు.

మలయాళ సూపర్​స్టార్ దుల్కర్ సల్మాన్​ క్రేజ్, పాపులారిటీ గురించి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథల్లో నటిస్తూ వెర్సటైల్ యాక్టర్​గా ఆయన పేరు తెచ్చుకున్నారు. రొమాటింక్, కామెడీ ఎంటర్​టైనర్స్​తో పాటు డిఫరెంట్ స్టోరీస్​లో యాక్ట్ చేస్తూ యూత్ ఆడియెన్స్​తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యారు. తెలుగులో కూడా ఆయన సినిమాల కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్​ను ఏర్పరచుకున్నారు దుల్కర్. రీసెంట్ బ్లాక్​బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’లోనూ స్పెషల్ అప్పియరెన్స్​తో ఆకట్టుకున్నారు. ఈ మధ్య ఆయన ఫోకస్ అంతా టాలీవుడ్​ మీదే పెడుతున్నారు. ఇక్కడ వరుస సినిమాలకు ఓకే చెబుతున్నారు.

తెలుగులో మరింత బిజీ అవుతున్నారు దుల్కర్ సల్మాన్. టాలీవుడ్​లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘లక్కీ భాస్కర్’లో దుల్కర్ నటిస్తున్నారు. ఇది సెట్స్ మీద ఉండగానే స్టార్ హీరో రానా ప్రొడక్షన్స్​లో ‘కాంత’ మూవీకి ఓకే చెప్పారు. ఇందులో దుల్కర్ మెయిన్ లీడ్​గా కనిపించనుండగా.. రానా గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు మరో తెలుగు ఆఫర్​కు దుల్కర్ ఓకే చెప్పారు. అదే ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, వైజయంతీ మూవీస్, లైట్ బాక్స్ బ్యానర్ల కలయికలో అల్లు అరవింద్, స్వప్న దత్, గుణ్ణం సందీప్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

దుల్కర్ బర్త్​డే సందర్భంగా ఈ మూవీ పోస్టర్​ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలో గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్​గా ఉంది. ఇందులో మెడపై కండువాతో ఉన్న దుల్కర్​ను చూస్తుంటే ఆయన రైతు పాత్రలో కనిపించనున్నారని అనిపిస్తోంది. పోస్టర్​లో ఓ చిన్నారిని కూడా చూడొచ్చు. ఫాదర్-డాటర్ సెంటిమెంట్​ బేస్డ్​గా సినిమా సాగనుందని తెలుస్తోంది.

ఇక, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చాలా సెలెక్టివ్​గా సినిమాలు చేస్తుంటారనేది తెలిసిందే. ఆయన సక్సెస్ రేట్ గురించి స్పెషల్​గా చెప్పాల్సిన పని లేదు. అటు స్వప్న దత్ కూడా వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్​తో ఫుల్ ఫామ్​లో ఉన్నారు. అలాంటి ప్రొడ్యూసర్స్ కలసి దుల్కర్​తో మూవీ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్​పై ఎక్స్​పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టుల్లో బిజీ అయిన దుల్కర్.. ఈ సినిమాలన్నీ విజయవంతమైతే తెలుగులో ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవల్​కు చేరుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇతర భాషా హీరోలు డబ్బింగ్ చిత్రాలతో సందడి చేయడం మామూలే. అప్పుడప్పుడు తెలుగులో స్పెషల్ రోల్స్​తో మెరుస్తూ ఫ్యాన్స్​కు కిక్ ఇస్తుంటారు. కానీ దుల్కర్ మాత్రం టాలీవుడ్​లో స్ట్రయిట్ మూవీస్​లో నటిస్తూ ఆడియెన్స్​కు మరింత చేరువయ్యేందుకు, తన మార్కెట్​ పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండటం అభినందనీయమనే చెప్పాలి. మరి.. తెలుగులో దుల్కర్ టాప్ రేంజ్​కు చేరుకుంటారని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments