Dharani
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. హేట్ కామెంట్స్, ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది. కొన్ని సార్లు ఇది హద్దుమీరడంతో.. దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా విషాదకర సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. హేట్ కామెంట్స్, ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది. కొన్ని సార్లు ఇది హద్దుమీరడంతో.. దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా విషాదకర సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..
Dharani
సోషల్ మీడియా వాడకం పెరిగాక.. లాభం ఎంత జరిగిందో నష్టం కూడా అదే స్థాయిలో వాటిల్లుతోంది. ఇక సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఈట్రోలింగ్ బాధిుతుల జాబితాలో ముందు వరుసలో ఉంటారు. మనకు నచ్చకపోతే సరి.. అకారణంగా నోటికి వచ్చినట్లు వ్యాఖ్యాలు చేస్తూ.. ఎదుటివారి మనసును ముక్కలు చేసి.. రాక్షసానందం పొందే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖం చూపించే అవసరం లేకుండా.. మనకు నచ్చని వారిపై విమర్శలు చేసే అవకాశం ఉండటంతో సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోతుంటారు. సెలబ్రిటీలు ఇలాంటి హేట్ కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోరు. కానీ అందరూ ఒకేలా ఉండరు కదా.. కొందరు సున్నిత మనస్కులు ఉంటారు. అలాంటి వాళ్లు ఇలాంటి ట్రోలింగ్ ను భరించలేక దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ మేకప్ మాన్ ట్రోలింగ్ ను భరించలేక దారుణానికి పాల్పడ్డాడు. ఆ వివరాలు..
సోషల్ మీడియా ట్రోలింగ్‌ను భరింలేక నాలుగు రోజుల క్రితం ప్రాన్షు అనే బాలుడు, మేకప్ మాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మీద సింగర్ చిన్మయి, అనుపమ స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేశారు. ప్రాన్షు మరణం గురించి ప్రస్తావిస్తూ.. అతడి తల్లి ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. అది చూసిన ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో ప్రాన్షు తల్లి.. తన కొడుకు మేకప్ మాన్ అని.. సొంతంగా ఈ కళను నేర్చుకున్నాడని చెప్పుకొచ్చింది. అతడిని చూసి తాను ఎంతో గర్వపడేదాన్ని అని.. ఎలాగైనా కొడుకు కల నెరవేర్చడం కోసం తనని ముంబై పంపిచడం కోసం డబ్బులు కూడా దాస్తున్నాను అని చెప్పుకొచ్చింది.
ఒంటరి తల్లిగా తన కొడుకు భవిష్యత్తు గురించి నిత్యం ఆలోచించేదాన్ని అని చెప్పుకొచ్చింది ప్రాన్షు తల్లి. నాలుగేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి.. కొడుకుతో కలిసి ఉంటున్నానని చెప్పుకొచ్చింది. గత ఏడాది తన కొడుకు తనకు వింతగా పరిచయం అయ్యాడని.. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ తాను అట్రాక్ట్ అవుతున్నానని తనతో చెప్పుకున్నాడు అని చెప్పుకొచ్చింది. అయితే తాను తన కుమారుడిని వారించలేదని.. ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని తెలిపింది. ఇక తన కుమారుడు మేకప్ మాన్ కావడం కోసం ఎంతో కష్టపడ్డాడని.. యూట్యూబ్‌లో చూసి నేర్చుకునేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాక తన కొడుకు జేమ్స్ చార్లెస్ అంతటి వాడు కావాలని కోరుకునేవాడని తెలిపింది.
ఇక ప్రాన్షు తనకు తానే మేకప్ వేసుకుని.. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవాడని.. వాటి మీద అనేక విమర్శలు వచ్చేవని చెప్పుకొచ్చింది. చాలా మంది తేడాగా ఉన్నావంటూ కామెంట్స్ చేసేవారన్నది. కానీ తన కొడుకు ఎంతో పరిణీతితో ఆలోచించేవాడని..హేట్ కామెంట్లు, ట్రోలింగ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు బాగా తెలుసంది. అంతేకాక తామిద్దరం ఆ ట్రోలింగ్స్ చూసి నవ్వుకునేవాళ్లం అని గుర్తు చేసుకుంది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగు రోజుల క్రితం ఉదయం పదిగంటలకు తన కొడుకుతో మాట్లాడానని.. అదే తనకు చివరి సంభాషణ అవుతుందని అప్పుడు తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడు తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా దారుణ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకొచ్చింది.
నా కుమారుడు ప్రాన్షు ఎక్కడున్నా వాడు ఓ రత్నం.. నా కొడుకుని నేను పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నేను తల్లిదండ్రులందరికీ ఓ మాట చెప్పాలని అనుకుంటున్నాను.. పిల్లలేం కావాలనుకుంటారో అది కానివ్వండి.. ఏం చేయాలనుకుంటారో చేయనివ్వండి.. ఎలా ఉంటే అలా అంగీకరించండి’.. అంటూ ప్రాన్షు తల్లి షేర్ చేసిన నోట్ వైరల్ అవుతోంది. దీనిపై హీరోయిన్ అనుపమ, సింగర్ చిన్మయి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాన్షు తల్లి నోట్ మీద అనుపమ స్పందిస్తూ గుండెబద్దలైనట్టుగా బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పెట్టింది.
మన భారతీయుల్లో ఇంత ద్వేషం, పగ, విషం ముందు నుంచే ఉందా..లేదంటే సోషల్ మీడియా అనే ఫ్లాట్ ఫాం దొరకడం వల్ల అదంతా ఇప్పుడు బయటకు వస్తుందా.. అంటూ ట్రోలర్ల మీద చిన్మయి మండిపడింది. నెగెటివ్ ట్రోలింగ్ వల్లే ప్రాన్షు ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు ఇప్పుడు బాధపడుతున్నారు. దీనిపై వైవా హర్ష సైతం స్పందించాడు. ఇంత చిన్న పిల్లాడి మీద ఎందుకంత నెగెటివిటీ అని బాధపడ్డాడు.
Trigger Warning: Queer-phobia; Mention of Su*cide
There is a creator in the US who looks very similar to this child, who has a huge business and has been able to do very well for himself and I am stunned how similar to James Charles that this child looks.
Whilst James has been… https://t.co/Cj8V8TSP6g pic.twitter.com/UKO4CRzVh7
— Chinmayi Sripaada (@Chinmayi) November 23, 2023