P Krishna
Drishyam Movie Created History: విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటించిన ‘దశ్యం’ సీరీస్ సెన్సేషన్ విజయం అందుకున్నాయి. తాజాగా ఈ మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది.
Drishyam Movie Created History: విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటించిన ‘దశ్యం’ సీరీస్ సెన్సేషన్ విజయం అందుకున్నాయి. తాజాగా ఈ మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది.
P Krishna
ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘దృశ్యం’ మూవీ ఒకటి. తన కుటుంబం కోసం ఓ తండ్రి పడే కష్టం.. ఒక హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ఎలాంటి వ్యూహాలు పన్నారన్నది ఈ మూవీ కథాంశం. ఈ చిత్రం మాతృక మలయాళం అయినప్పటికీ అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ తదితర భాషల్లో రీమేక్ చేశారు. అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దృశ్యం తర్వాత వచ్చిన దృశ్యం 2 కూడా మంచి సక్సెస్ సాధించింది. తాజాగా ఈ మూవీ భారతీయ చిత్రాల్లోనే ఒక అద్భుతం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
ఇప్పటి వరకు భారతీయ చిత్రాలు చాలా వరకు హాలీవుడ్ సినిమాలు స్ఫూర్తిగా తీసుకొని రీమేక్ అయ్యాయి. కానీ.. భారతీయ సినిమాలు నేరుగా హాలీవుడ్ లో రీమేక్ కాలేదని అంటుంటారు. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఏకంగా హాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ రీమేక్ అవ్వబోతుంది. అది కూడా ఓ సౌత్ సినిమా కావడం విశేషం. ఆ చిత్రమే ‘దృశ్యం’. ఈ సినిమాను హాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ రీమేక్ కోసం పెద్ద నిర్మాణ సంస్థ రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే దృశ్యం మూవీ భారత దేశంలో పలు భాషల్లో రీమేక్ అయ్యింది. తెలుగు లో దృశ్యం, దృశ్యం 2 మూవీలో వెంకటేష్ హీరోగా నటించారు. ఈ రెండు సినిమాలకు టాలీవుడ్ లో విశేష ఆదరణ లభించింది. మరి హాలీవుడ్ లో ఎవరు నటిస్తారో చూడాలి.
వాస్తవానికి ఈ చిత్రం మాలీవుడ్ లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించారు. 2013లో ఈ చిత్రం రిలీజ్ అయి అప్పట్లో సెన్సేషన్ హిట్ అయ్యింది. తర్వాత ఈ చిత్రం తెలుగు లో రీమేక్ అయ్యింది. ఈ చిత్రం 2017 లో సింహలభాష, 2019లో చైనీస్ భాషలో రీమేక్ చేశారు. 2021 లో ఇండోనేషియాలో రీమేక్ చేశారు, 2023లో కొరియన్ లో రీమేక్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం మొదటిసారిగా హాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. ఈ చిత్రం విదేశీ హక్కులను పనోరమ స్టూడియో కొనుగోలు చేసింది. ఆ సంస్థ ఇప్పుడు దృశ్యం, గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, జోట్ ఫిల్స్మ్ తో పాటు హాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. భారతీయ చిత్రానికి ఇంత క్రేజ్ వచ్చినందుకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక భారతీయ సినిమా.. అందులోనూ వెంకటేష్ నటించిన రీమేక్ మూవీ అయిన దృశ్యం సినిమా హాలీవుడ్ లో రీమేక్ అవుతుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.