4వ రోజు నాలుగు సినిమాల కలెక్షన్స్‌ ఇలా.. అదరగొడుతున్న ఆయ్‌

4వ రోజు నాలుగు సినిమాల కలెక్షన్స్‌ ఇలా.. అదరగొడుతున్న ఆయ్‌

ఆగస్టు 15, ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్స్ లో నాలుగు కొత్త సినిమాలు రిలీజైయ్యాయి. అందులో హరీశ్ శంకర్, రవితేజ  కాంబినేషన్ లో.. మిస్టర్ బచ్చన్ తో పాటు రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా తెరకెక్కింది. ఇక వీటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఆయ్ సినిమాతో పాటు మరోపక్క ఈ తెలుగు మూవీలకు పోటీగా విక్రమ్ తంగలాన్ మూవీ కూడా అదే రోజున రిలీజైంది. అయితే ఈ నాలుగు సినిమాల్లో డే4 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో.. ఏ సినిమా ముందంజులో ఉందో తెలుసుకుందాం.

ఆగస్టు 15, ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్స్ లో నాలుగు కొత్త సినిమాలు రిలీజైయ్యాయి. అందులో హరీశ్ శంకర్, రవితేజ  కాంబినేషన్ లో.. మిస్టర్ బచ్చన్ తో పాటు రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా తెరకెక్కింది. ఇక వీటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఆయ్ సినిమాతో పాటు మరోపక్క ఈ తెలుగు మూవీలకు పోటీగా విక్రమ్ తంగలాన్ మూవీ కూడా అదే రోజున రిలీజైంది. అయితే ఈ నాలుగు సినిమాల్లో డే4 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో.. ఏ సినిమా ముందంజులో ఉందో తెలుసుకుందాం.

ఈ ఏడాది సంక్రాతి తర్వాత చాలా గ్యాప్ లో టాలీవుడ్ లోని సినిమాల జాతర నెలకొన్నది. ముఖ్యంగా ఆగస్టు 15, ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్స్ లో నాలుగు కొత్త సినిమాలు రిలీజైయ్యాయి. అందులో హరీశ్ శంకర్, రవితేజ  కాంబినేషన్ లో.. మిస్టర్ బచ్చన్ తో పాటు రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా తెరకెక్కింది. ఇక వీటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఆయ్ సినిమాతో పాటు మరోపక్క ఈ తెలుగు మూవీలకు పోటీగా విక్రమ్ తంగలాన్ మూవీ కూడా అదే రోజున రిలీజైంది. అయితే వీటిలో మొదటి నుంచి మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ కు భారీ హైప్ కొనసాగింది.

కానీ, రిలీజైన తర్వాత ఈ మూవీస్ అందరీ అంచనాలను తారుమారు చేశాయి. దీంతో ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోపోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచింది. ఇకపోతే ఎటువంటి అంచనాలు లేకుండా.. రిలీజైన ఆయ్, తమిళ్ మూవీ తంగలాన్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా కాసులు వర్షం కురిపిస్తుంది. మరి ఇంతకీ ఈ నాలుగు సినిమాల డే4 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో.. ఏ సినిమా ముందంజులో ఉందో తెలుసుకుందాం.

మిస్టర్ బచ్చన్

మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. కాగా, ఈ సినిమాకు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇకపోతే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే సినిమాపై మొదటి నుంచి భారీ హైప్ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దీంతో మొదటి రోజు నుంచే మిస్టర్ బచ్చన్ కు దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమ విడుదలైన రెండో రోజు రల్డ్ వైడ్ గా రూ. 1.75 కోట్లు రాబట్టగా.. మూడవ రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ జరగడంతో వరల్డ్ వైడ్ గా రూ. 31.00 కోట్లు  మాత్రమే బిజినెస్ జరిగింది. ఇక  ఈ సినిమాకు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ 4వ రోజు కూడా కలెక్షన్స్ బాగా డౌన్ అయ్యాయి. దీంతో మిస్టర్ బచ్చన్ కు  తెలుగు రాష్ట్రాల్లో రూ. 55 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 65 లక్షలు వసూలు చేసింది. ఇలా 4 రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ. 7.50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి నిరాశ పరిచింది. దీంతో మిస్టర్ బచ్చన్ బ్రేక్ ఈవెన్ ను టార్గెట్ కూడా దాటడం కూడా కష్టంగానే ఉంది.

డబుల్ ఇస్మార్ట్

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్.  ఇక ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ మూవీకి ఛార్మికౌర్ నిర్మాతగా వ్యవహారించారు. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ ఆగస్టు 15వ తేదీన థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కు ముందు భారీ హైప్ ఉన్న విషయం తెలిసిందే. ఇదే ఊపులో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ముందంజలో నిలిచినా.. రెండో రోజు నుంచి మాత్రం కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి.

అయితే  ఆదివారం రోజున అయిన డబుల్ ఇస్మార్ట్ కు  కలెక్షన్లు పెరుగుతాయని భావించినప్పటికీ.. సినిమా వసూళ్లు మరీంత దారుణంగా నమోదు అయ్యాయి. ఈ చిత్రం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. డే4 కలెక్షన్స్  బాక్సాఫీస్ వద్ద రూ. 1 కోటి మాత్రమే  నమోదు అయ్యాయి. ఇకపోతే  వరల్డ్ వైడ్‌గా 2 కోట్లు వసూలు చేసింది. ఇలా చూసుకుంటే.. డబుల్ ఇస్మార్ట్  సినిమా 4 రోజుల్లో 17 కోట్ల గ్రాస్ వసూళ్లను  మాత్రేమే సాధించింది. మరీ రానున్న రోజుల్లో డబుల్ ఇస్మార్ట్ రానున్న రోజుల్లో  బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను క్రాస్ చేసి ఎంత వసూలు చేస్తుందో చూడాల్సింది.

ఆయ్
తారక్ బావమరిదిగా ప్రేక్షకులకు  పరిచయం అవుతున్న నార్నె నితిన్ తాజాగా ఆయ్ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చారు. ఇకపోతే  నితిన్ కు ఆయ్ రెండో సినిమా కావడం గమన్హారం. అయితే ఏమాత్రం బజ్, భారీ హైప్ లేకుండా.. పెద్ద సినిమాలకు పోటీగా విడుదలైన ఆయ్ సినిమా ఆశించిన ఫలితమే దక్కింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా రికార్డ్ లు సృష్టిస్తుంది.  చిన్న సినిమాగా థియేటర్స్ లో విడుదలైన ఆయ్  మొదటి రోజే ఈ సినిమా రూ. 2 కోట్ల వసూలు చేయగా.. రెండో రోజు కలెక్షన్స్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 65 లక్షలు కలెక్షన్స్ జరిగాయి. ఇలా  వరల్డ్ వైడ్ గా చూస్తే  రూ. 75 లక్షలు రాబట్టింది. ఇకపోతే నాలుగో రోజు మాత్రం ఈ సినిమాకు  రూ. 1.46 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఓవరల్ గా నాలుగు రోజుల్లో కలిపి ఆయ్ మూవీ రూ. 4.51 కోట్లను కొల్లగొట్టి దూసుకుపోతుంది. అంతేకాకుండా.. ప్రస్తుతం బరిలో ఉన్న నాలుగు సినిమాల్లో ఆయ్ మంచి పాజిటివి టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగా ముందజులో అదరగొడుతుంది.

తంగలాన్
స్టార్ హీరో విక్రమ్, దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్ ల తెరకెక్కిన తాజా తమిళ్ చిత్రం తంగలాన్. కాగా, ఈ సినిమా విక్రమ్ కెరీర్ లో 61 చిత్రంగా వచ్చింది. ఇకపోతే ఈ సినిమా కూడా తెలుగు మూవీస్ కు పోటిగా ఆగస్ట్ 15వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే తంగలాన్ విడుదలైన తొలి రోజు నుంచే చాలా ప్రాంతల్లో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మూవీని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా రూ.140 కోట్లతో రూపొందించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ అనుకున్న దానికంటే భారీగా రెస్పాన్స్ రావడంతో పాటు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇకపోతే తంగలన్ తమిళ్ వెర్షన్ లో మొదటి రోజు రూ. 12 కోట్లు, రెండో రోజు రూ.4కోట్లు.. అలాగే తెలుగు వెర్షన్ లో మొదటి రోజు రూ. 1.5 కోట్లు.. రెండో రోజు రూ.1 కోటి వసూళ్లు చేయగా.. మూడు రోజు కలెక్షన్స్ కూడా ఇంకాస్త పెరిగాయి.

ఇక నాలుగోవ రోజు కలెక్షన్స్ విషయానికొస్తే..  తమిళ్ లో తంగలాన్ కు రూ.5 కోట్ల రూపాయలు, తెలుగులో రూ.1 కోటి రూపాయలు, మలయాళంలో రూ.50 లక్షలు, కన్నడలో రూ.70 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇలా ఓవరల్ గా చూసుకుంటే.. తంగలాన్ డే4 కలెక్షన్స్ రూ. దాంతో ఈ చిత్రం ఇండియాలో 7.2 కోట్లు నికరంగా.. 9 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇలా చూసుకుంటే.. రానున్న రోజుల్లో విక్రమ్ తంగలాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాల్సింది.

Show comments