iDreamPost
android-app
ios-app

Jnaneswari: రామ్‌చరణ్‌పై జ్ఞానేశ్వరి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. పెళ్లి చేసుకునేదట..

  • Published Dec 06, 2023 | 1:47 PM Updated Updated Dec 06, 2023 | 1:47 PM

యాక్టింగ్ తో పాటు ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ యువకులను మైమరపిస్తూ ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ మ్యాటర్స్ ను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

యాక్టింగ్ తో పాటు ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ యువకులను మైమరపిస్తూ ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ మ్యాటర్స్ ను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

  • Published Dec 06, 2023 | 1:47 PMUpdated Dec 06, 2023 | 1:47 PM
Jnaneswari: రామ్‌చరణ్‌పై జ్ఞానేశ్వరి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. పెళ్లి చేసుకునేదట..

ఈ మధ్య కాలంలో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే.. ‘జ్ఞానేశ్వరి కండ్రేగుల’ గురించి చెప్పొచ్చు. అద్భుతమైన నటన, అంతకుమించిన అందంతో సినీ రంగంలో కొనసాగుతోంది ఈ భామ. ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టీవ్‌గా ఉంటోంది. తన పోస్టులతో ఫాలోయింగ్‌ రోజు రోజుకు పెంచుకుంటోంది. ఇక, రీసెంట్‌గా విడుదలైన ‘దూత’ వెబ్ సిరీస్‌లో యూట్యూబర్ కిరణ్ పాత్రను పోషించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

తాజాగా ఈ అమ్మడు తన అభిమాన నటుడు రాంచరణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన అభిమాన నటుడు రామ్‌ చరణ్ అని చెప్పింది. ఈ అమ్మడి బుక్స్ అన్నిటిలో రామ్‌ చరణ్ ఫొటోలే ఉండేవట. ‘రాంచరణ్ ను కలిస్తే ఏం చెప్తారు’? అని జర్నలిస్ట్‌ ప్రశ్నించగా.. “ఒక పదేళ్ల క్రితం రాంచరణ్ ను కలిసి ఉంటే పెళ్లి చేసుకోమని అడిగేదాన్ని” అని అందంగా నవ్వేసింది. “కానీ, ఇప్పుడు కలిస్తే ఓ సినిమాలో కలిసి నటించాలని ఉందని అడుగుతాను” అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇటీవల విడుదలైన ‘మంత్ అఫ్ మధు’ చిత్రంలో కూడా ఈ అమ్మడు నటించింది. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటించిన ఈ చిత్రంలో వాసుకి పాత్రలో ఆకట్టుకుంది. ఆ సినిమాలో తన అందంతో, నటనతో కుర్రకారు హృదయాలను దోచేసుకుంది. హీరో నవీన్ చంద్రతో డేట్ కి వెళ్లే సీన్ లో ఈ భామ తన గ్లామర్ తో అందరిని కట్టిపడేసింది. మంత్ అఫ్ మధు చిత్రంతో జ్ఞానేశ్వరికి మంచి పేరు వచ్చింది.

‘దూత’ వెబ్ సిరీస్‌తో ఈ నటి స్థాయి ఇంకాస్త పెరిగిందని చెప్పి తీరాలి. ‘అక్కినేని నాగచైతన్య’ తొలిసారిగా నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. దూత ప్రస్తుతం అమెజాన్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో జ్ఞానేశ్వరి.. దెయ్యాల మీద రీసర్చ్ చేసే పాత్రలో నటించింది. ఆమె కథలో కనిపించింది కాసేపే అయినా.. తన పాత్రలో జీవించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా, ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘దూత’ మొత్తం 8 ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, గ్లామరస్ బ్యూటీ జ్ఞానేశ్వరి తన అభిమాన నటుడు రామ్‌ చరణ్ గురించి.. చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet