iDreamPost
android-app
ios-app

మహేష్ మూవీలో ఆడిపాడిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఎంతలా మారిపోయిందంటే?

  • Published Aug 28, 2024 | 5:42 PM Updated Updated Aug 28, 2024 | 5:42 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడి పాడిన ఈ నటి గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..? చూస్తే అస్సలు నమ్మలేరు..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడి పాడిన ఈ నటి గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..? చూస్తే అస్సలు నమ్మలేరు..

  • Published Aug 28, 2024 | 5:42 PMUpdated Aug 28, 2024 | 5:42 PM
మహేష్ మూవీలో ఆడిపాడిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఎంతలా మారిపోయిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వదేశీ భామలే కాకుండా విదేశీ వనితలు కూడా తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. వారిలో ఒకరు పార్వతి మెల్టన్. తన చూపుతోనే కుర్రకారును మెల్ట్ చేసేసిన ఈ ఓవర్సీస్ సోయగం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నట సింహం బాలకృష్ణ, మంచు విష్ణు, సుమంత్, నరేష్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది.. యూత్ గుండెల్లో చిచ్చు పెట్టి ఉన్నపళంగా కనిపించకుండా పోయింది. 2012లో నటనకు స్వస్తి చెప్పిన ఈ గ్లామరస్ క్వీన్.. పుష్కర కాలం పూర్తైనా నటించడం లేదు. ఆమెను తెలుగు ప్రేక్షకులు మరిచిపోనూ లేదు.  అంతలా యువకుల గుండెల్లో గూడుకట్టుకున్న పార్వతిది.. మరిచిపోయే అందమా. మహేష్ బాబు దూకుడు మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో మతిపోగోట్టిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఎంతలా మారిపోయిందంటే..?

పార్వతి మెల్టన్.. ఇండో అమెరికన్. కాలిఫోర్నియాలో జర్మన్, స్కాట్లాండ్ తండ్రి..పంజాబ్ తల్లికి పుట్టింది. ఆమె విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే సాగింది. వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ విదేశీ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మంచు విష్ణుతో కలిసి గేమ్, సుమంత్ సరసన మధుమాసంలో కనిపించింది. నరేష్ అల్లరి అల్లరి చిత్రంలో మెరిసింది. అయితే హీరోయిన్‌గా సినిమాలు సక్సెస్ కాకపోవడంతో సెకండ్ హీరోయిన్ క్యారెకర్లకు షిఫ్ట్ అయిపోయింది. జల్సాలో ఇలియానా ఫ్రెండ్‌గా జోత్య్స పాత్రలో ఆకట్టుకుంది. జల్సా అనగానే ‘జెన్నీఫర్ లోఫేజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి’ అంటూ పవన్ కళ్యాణ్‌తో పొగిడించుకుంది. శరీరాన్ని ఒంపు సొంపులు తిప్పుతూ.. ఈ పాటతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Parvati Melton, Jalsa, Dookudu 1

ఆ తర్వాత దూకుడులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు పాటలో చిందులేసింది. అప్పట్లో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. బాలకృష్ణతో శ్రీమన్నారాయణ, చివరగా శ్రీరామ్ శంకర్ యమహో యమలో కనిపించింది. మలయాళంలో, హిందీలో ఒకటి, రెండు చిత్రాలు చేసిన ఆమె.. 2013లో శంసులాలానిని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ తిరిగి అమెరికా వెళ్లిపోయి.. అక్కడే సెటిల్ అయ్యింది. ఆమెకు ఓ కొడుకు కూడా. కానీ ఆమె సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూస్తుంటే.. పెళ్లయ్యిందంటే అస్సలు నమ్మరు. ఇక పిల్లోడు ఉన్నారంటే నిజమేనా అనిపించకమానదు. ఎందుకంటే… అప్పట్లోనే కాస్త సన్నగా కనిపించిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. మరింత సన్నజాజి తీగల మారి మెస్మరైజ్ చేస్తూ.. సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Parvati Melton (@parvatim)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet