Swetha
సినిమా అంటే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ గుర్తుస్తున్నాయి అందరికి. అయితే ఎప్పటికప్పుడు ఏ ఏ సినిమాలు, సిరీస్ లు ఏ ప్లాట్ ఫార్మ్స్ లో వస్తున్నాయో కూడా ఎప్పటికప్పుడు లిస్ట్ వచ్చేస్తుంది. అయితే కొన్ని సినిమాలు తెలుగులో లేవని మిస్ చేసేస్తూ ఉంటారు కొందరు. అలా మిస్ చేసిన సినిమాలలో కనుక ఈ సినిమా ఉన్నట్లయితే ఒక మంచి వర్త్ వాచింగ్ మూవీని మిస్ అయినట్లే.
సినిమా అంటే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ గుర్తుస్తున్నాయి అందరికి. అయితే ఎప్పటికప్పుడు ఏ ఏ సినిమాలు, సిరీస్ లు ఏ ప్లాట్ ఫార్మ్స్ లో వస్తున్నాయో కూడా ఎప్పటికప్పుడు లిస్ట్ వచ్చేస్తుంది. అయితే కొన్ని సినిమాలు తెలుగులో లేవని మిస్ చేసేస్తూ ఉంటారు కొందరు. అలా మిస్ చేసిన సినిమాలలో కనుక ఈ సినిమా ఉన్నట్లయితే ఒక మంచి వర్త్ వాచింగ్ మూవీని మిస్ అయినట్లే.
Swetha
తెలుగు, తమిళం, మలయాళీ, హింది, ఇంగ్లీష్ అని ప్రాంతీయ బేధాలు చూపించకుండా.. అందరికి న్యాయం చేస్తున్నారు ఓటీటీ మూవీ లవర్స్. ఓటీటీ లోకి సినిమా వస్తుదంటే చాలు అది ఎలా ఉండబోతుందా అని ముందు నుంచే ఆసక్తితో ఉంటారు మరికొందరు. అలాగే కేవలం తెలుగు మూవీస్ మాత్రమే చూద్దాం అనే ఆసక్తితో ఉంటారు ఇంకొందరు. కానీ లాంగ్వేజ్ అనే కంచెను దాటి ముందుకు వస్తే.. ఎన్నో అద్భుతమైన, ఆకట్టుకునే హర్రర్ , థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ సినిమాలు అన్నీ కూడా.. కను రెప్ప ఆర్పకుండా చూసేయొచ్చు. దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్బింగ్ అవుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడో కొన్ని మాత్రమే ఒరిజినల్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. తెలుగులో లేదు కదా అని వీటిని మిస్ చేస్తే మాత్రం.. ఒక మంచి వర్త్ వాచింగ్ మూవీ మిస్ అయినట్లే. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ సినిమా పేరు. “పొన్ ఒండ్రు కండెన్”. ఈ సినిమా లేటెస్ట్ గానే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి అడుగుపెట్టింది. ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, వసంత్ రవి ముఖ్య పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా తెలుగులో లేకపోయినా సరే.. ఎందుకు ఈ సినిమాను చూడాలనే విషయానికొస్తే.. ఈ సినిమా స్టోరీ ప్లాట్ చూసేద్దాం. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ కొత్త ఏముందిలే అనుకుని లైట్ తీసుకుంటే మాత్రం పొరపాటే. ఇప్పటివరకు చూసిన ట్రైయాంగిల్ స్టోరీస్ అన్ని ఒక రకం అయితే.. ఇది మరొక రకం. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే అమ్మాయిని లవ్ చేస్తారు. కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ డైవర్స్ అయిపోతుంది. ఆ డైవర్స్ అయ్యేది ఎవరితోనో కాదు.. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరితోనే.. ఇది అసలు ట్రైయాంగిల్ లవ్ స్టోరీనా ఇంకెందన్నానా అనే డౌట్స్ అందరికి స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అసలు స్టోరీ ఏంటంటే..
ఈ సినిమాలో హీరోయిన్ ఒక చెఫ్.. ఒక హీరో గైనాకాలజిస్ట్ .. ఇంకొక హీరో ఎటువంటి జాబ్ చేయడు. అయితే, డాక్టర్ గా ఉన్న హీరోకు వాళ్ళ ఫ్యామిలి మెంబర్స్.. తనకు తెలీకుండా పెళ్లి చూపులు అరెంజ్ చేస్తుంటే.. అతను మాత్రం వాటి అన్నిటిని క్యాన్సిల్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ హీరోస్ ఇద్దరు కూడా చిన్నపటినుంచి మంచి ఫ్రెండ్స్. ఒక రి యూనియన్ ద్వారా.. కొంతకాలం తర్వాత మళ్ళీ కలుస్తారు. అయితే స్టోరీ నడిచే కొద్దీ.. జాబ్ లేని వ్యక్తి.. అనుకోకుండా హీరోయిన్ ను ఒక ఫంక్షన్ లో చూసి ప్రేమలో పడతాడు. దానికి అతని ఫ్రెండ్ ఏ హెల్ప్ చేస్తాడు. కానీ.. కొంతకాలం తర్వాత ఆ హీరోయిన్ ఎవరో కాదు తన ఫ్రెండ్ తో డైవర్స్ తీసుకున్న అమ్మయేనని తెలుసుకుంటాడు. మరి ఆ తర్వాత ఎం జరుగుతుంది ! ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు ! వాళ్ళ లవ్ కొనసాగుతుందా లేదా విడిపోయిన భార్య భర్తలు కలుస్తారా ! అసలు ఫ్రెండ్ భార్యను ప్రేమించడం ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.