iDreamPost
android-app
ios-app

Kalki2898 AD: కల్కి సినిమాకు ఎన్నికల గండం? డేట్స్ క్లాష్!

  • Published Mar 16, 2024 | 6:12 PM Updated Updated Mar 16, 2024 | 6:15 PM

ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898 ఎడి" పై ఇప్పుడు అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఇప్పుడు ఈ సినిమా విడుదల డేట్ పై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి.

ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898 ఎడి" పై ఇప్పుడు అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఇప్పుడు ఈ సినిమా విడుదల డేట్ పై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి.

  • Published Mar 16, 2024 | 6:12 PMUpdated Mar 16, 2024 | 6:15 PM
Kalki2898 AD: కల్కి సినిమాకు ఎన్నికల గండం? డేట్స్ క్లాష్!

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో .. భారీ అంచనాల మధ్యన రాబోతున్న సినిమా “కల్కి 2898 AD”. సలార్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్ డేట్ ఎప్పటికపుడు వైరల్ అవుతూనే ఉంది. దీనితో రోజు రోజుకు కల్కిపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే ఈ సినిమా విడుదల తేదీ కూడా పోస్ట్ పోన్ అవుతూ.. ఎట్టకేలకు మే 9 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం .. అనుకున్న టైమ్ కి కల్కి విడుదల కాకపోవచ్చనే వార్తలు గట్టిగ వినిపిస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు.

తాజాగా దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో మే 13న పోలింగ్ జరగనుంది. అలాగే మే 7న కూడా పన్నెండు రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాబట్టి, ఈ సారి కల్కి సినిమా విడుదలకు ఎన్నికలు అడ్డుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాస్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తారన్న సంగతి తెలిసిందే. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కేవలం ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కల్కి సినిమాను విడుదల చేయడం వలన.. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, ఎన్నికలు వస్తున్నాయంటే.. ఆ సమయాల్లో ఉండే నియమ నిబంధనల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందంటే.. రాత్రులు గుంపులుగా తిరగడానికి వీలు లేదు. దీనితో సినిమాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోవచ్చు. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి.. కల్కి సినిమా కలెక్షన్స్ విషయంలో దెబ్బ తినే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. కలెక్షన్స్ పై కూడా ఎన్నికల ప్రభావం పడే ఛాన్స్ ఎక్కువే ఉంది. సో ఈ లెక్కన మే 9న కల్కి సినిమా విడుదల అవ్వడం కాస్త కష్టంగానే అనిపిస్తోంది. దీని గురించి వైజయంతి మూవీస్ వారి నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అభిమానులకు ఓ రకంగా ఇది బ్యాడ్ న్యూస్ ఏ అయినా కూడా.. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం.. కల్కి పోస్ట్ పోన్ అయితేనే బెటర్ అని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetholiganbetKavbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetMadridbetMadridbetcasibom girişjojobet girişCasibom Girişmeritkingsuperbetinjojobetholiganbet girişholiganbet girişMarsbahis GüncelHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş