iDreamPost
android-app
ios-app

జై హనుమాన్ అంచనాలను అందుకుంటుందా?

  • Published Feb 04, 2024 | 4:57 PM Updated Updated Feb 04, 2024 | 4:57 PM

సంక్రాంతి బరిలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన చిత్రం హనుమాన్. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. చిన్న చిత్రంగా వచ్చినా.. ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

సంక్రాంతి బరిలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన చిత్రం హనుమాన్. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. చిన్న చిత్రంగా వచ్చినా.. ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

  • Published Feb 04, 2024 | 4:57 PMUpdated Feb 04, 2024 | 4:57 PM
జై హనుమాన్ అంచనాలను అందుకుంటుందా?

జై హనుమాన్ అంచనాలను అందుకుంటుందా? ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన ‘హ‌నుమాన్’ ఇటీవ‌ల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. బాల నటుడిగా ప్రేక్షకులకు సుపరిచితుడైన తేజ సజ్జ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. అమృతా అయ్యర్, సముద్రఖని, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, సత్య, గెటప్ శ్రీను వంటి నటీనటులు ఈ సినిమాకు ఎసెట్ గా నిలిచారు. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశాడు దర్శకుడు ప్రశాంత్. జై హనుమాన్ త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది.

హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తో  జై హనుమాన్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కె.నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించగా… గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందించారు.  విజువల్ వండర్స్ కు మ్యూజిక్ తోడై.. థియేటర్లలో గూస్ బంప్స్ వచ్చేశాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా 300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద చిన్న సినిమాల్లో అతి పెద్ద చిత్రంగా నిలిచింది. తొలి భాగానికి అయితే పెద్దగా అంచనాలు లేకపోవడం బాగా కలిసి వచ్చింది. మరి భారీ అంచనాల నేపథ్యంలో జై హనుమాన్ సినిమాని కూడా ఇదే స్థాయిలో విజయం సాధించే విధంగా తీర్చి దిద్దాలని ప్రశాంత్ వర్మ మరియు చిత్ర బృందం దృఢంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

హనుమంతుడి పాత్రలో చిరంజీవి, రాముడి పాత్రలో మహేష్ బాబు నటించే అవకాశం ఉందని వినిపిస్తున్నా ఇంకా ఈ విషయం పై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఏదేమైనా జై హనుమాన్ సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి రాబోయే భారీ సినిమాల్లో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకుల యొక్క భారీ అంచనాలను అందుకుని జై హనుమాన్ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుందాం. ఏమంటారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.