iDreamPost
android-app
ios-app

Niharika- Chaitanya: మెగా డాటర్ నిహారిక- చైతన్య అందుకే విడిపోయారా?

Niharika- Chaitanya: మెగా డాటర్ నిహారిక- చైతన్య అందుకే విడిపోయారా?

సినిమా ఇండస్ట్రీలో ఎంత ఘనంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఆ పెళ్లి గురించి కనీసం ఒక నెల రోజులు అయినా చెప్పుకుంటారు. అలాగే ఏ జంట అయినా విడిపోతే అందుకు ప్రచారం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. వాళ్లు ఒక అకేషన్ లో కలిసి కనిపించకపోతే ఇంక మొదలు పెట్టేస్తారు. భర్తకు దూరంగా ఫలానా హీరోయిన అని రాసేస్తుంటారు. కొన్నిసార్లు ఆ వార్తలు నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో అలా వైరల్ అయి.. నిజంగా విడిపోయిన జంట చైతన్య- నిహారిక. అయితే వీళ్లు ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.

నిహారిక- చైతన్య అధికారికంగా విడిపోయారు. వారికి విడాకులు కూడా జారీ అయ్యాయి. ఆ విషయాన్ని వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఇద్దరు మాట్లాడుకుని, పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొంత ప్రైవసీని ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. వారి విడాకుల వార్త నెట్టింట ఎంతో వైరల్ అయింది. నెటిజన్స్ కూడా అది వాళ్ల వ్యక్తిగత విషయం, ఎవరి జీవితం వారిది అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే ఎందుకు విడిపోయారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. “అందరికీ ఇప్పుడు ఈ వార్త తెలిసింది. కానీ, వాళ్లు జనవరిలోనే విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. విడాకులు అనగానే పలు కారణాలు ఉంటాయి. యాటిట్యూడ్ డిఫరెన్సెసా, పర్సనాలిటీ డిఫరెన్సెసా ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. వారి లైఫ్ స్టైల్ కూడా కారణం కావచ్చు. నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది. చుట్టూ నేమ్, ఫేమ్ ఉన్న వాళ్లు, ఒక రకమైన వాతావరణం ఉంటుంది. అందరూ ఓపెన్ గా, బ్రాడ్ గా, ఓవర్ బ్రాడ్ గా థింక్ చేసే ఫ్యామిలీ. ముఖ్యంగా ఈమె మెంటాలిటీకి, అతని మెంటాలిటీకి సెట్ అయి ఉండకపోవచ్చు. వారి కుటుంబం, వాళ్ల లైఫ్ స్టైల్ వేరు ఉండచ్చు” అంటూ డాక్టర్ పూజిత వ్యాఖ్యానించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom