చిన్నతనంలో ఎవరైనా అల్లరి చేస్తారు. ఫ్యాన్స్ ఎంతగానో అభిమానించే సినీతారలు కూడా చిన్నప్పుడు అల్లరి చేసినవారే. కాకపోతే సెలబ్రిటీలు కదా.. వాళ్ల గురించి వాళ్లే చెప్పేదాకా మనకు తెలియదు. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా..? చాలా టాలెంటెడ్. తన తల్లితో కలిసి ముద్దుగా ఆడుకుంటున్నాడు. ఎంతో క్యూట్ గా నవ్వుతున్న ఆ పిల్లాడు.. ప్రస్తుతం స్టార్ యాక్టర్. అసలు ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో అతని క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే.. అతని సినిమాల సెలక్షన్.. నటన అలాంటివి. అంతేగాక తెలుగులోను ఇతనికి సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు వేరే స్టార్స్ సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. అదిగాక విలన్ గాను సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మరో విశేషం ఏంటంటే.. మీరు బాగా గమనిస్తే.. ఆ ఫోటోలో ఓ నేషనల్ అవార్డు విన్నర్ కనిపిస్తాడు. ఏంటి ఇప్పుడైనా గుర్తొచ్చిందా అతను ఎవరో..? అయినా రాలేదంటే ఇంకో క్లూ ఇస్తా. ఈ నటుడు స్ట్రెయిట్ తెలుగు మూవీ ఒకే ఒక్కటి చేశాడు. కానీ.. ఇతను ఏ భాషలో సినిమాలు చేసినా.. అవి తెలుగులోకి డబ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే.. చెప్పాకదా అతని సినిమాలకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది. మూసధోరణిలో కాకుండా డిఫరెంట్ మూవీస్ చేస్తుంటాడు.
నేషనల్ అవార్డు విన్నర్ అయినా గుర్తురాలేదా..? అతను తెలుగులో చేసింది ఒక్క సినిమానే. కానీ.. అది పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ సినిమాలో ఇతని డైలాగ్ చాలా ఫేమస్. అదేంటంటే.. ఇతను పోలీస్ అయ్యుండి హీరోని పార్టీ అడుగుతుంటాడు. హా.. ఇప్పుడు తెలిసి పోయింది కదా! అవును.. పార్టీ లేదా పుష్ప? అని అడిగే భన్వర్ సింగ్ షేకావత్ ఇతనే. మలయాళం స్టార్ ఫాహద్ ఫాజిల్. తెలుగు యూత్ మోస్ట్ ఫేవరేట్ అయిన హీరోయిన్ నజ్రియా నాజిమ్ కి భర్త అని తెలిసిందే. ఇటీవల నాయకుడు సినిమాతో విలన్ గా అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు ఫాహద్. ప్రస్తుతం పుష్ప 2తో పాటు చాలా సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఇతనికి సంబంధించి చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పిల్లాడి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.