iDreamPost
android-app
ios-app

అర్జున్ మూవీలో శ్రియ చెల్లెలిగా నటించిన ఈ పాప ఎవరో తెలుసా..? బుల్లితెర సౌందర్య..!

  • Published Jul 01, 2024 | 4:06 PM Updated Updated Jul 01, 2024 | 4:06 PM

మహేష్ బాబు, శ్రియ జంటగా నటించిన చిత్రం అర్జున్. గుణ శేఖర్ దర్శకుడు. ఇందులో శ్రియ చెల్లెలి పాత్రలో ఓ అమ్మాయి నటించింది గుర్తుందా.. మన బుల్లితెర ఫర్ ఫెక్ట్ మ్యాన్ మానస్. . ఓ అమ్మాయిని లేచిపోదామని పిలుస్తుంటాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా..

మహేష్ బాబు, శ్రియ జంటగా నటించిన చిత్రం అర్జున్. గుణ శేఖర్ దర్శకుడు. ఇందులో శ్రియ చెల్లెలి పాత్రలో ఓ అమ్మాయి నటించింది గుర్తుందా.. మన బుల్లితెర ఫర్ ఫెక్ట్ మ్యాన్ మానస్. . ఓ అమ్మాయిని లేచిపోదామని పిలుస్తుంటాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా..

  • Published Jul 01, 2024 | 4:06 PMUpdated Jul 01, 2024 | 4:06 PM
అర్జున్ మూవీలో శ్రియ చెల్లెలిగా నటించిన ఈ పాప ఎవరో తెలుసా..? బుల్లితెర సౌందర్య..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాల్లో ఒకటి అర్జున్. గుణశేఖర్ దర్శకత్వంలో 2004లో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నటనకు గాను మహేష్, సరితకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అభించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్లో కూడా ఈ మూవీని ప్రదర్శించారు. ఇందులో శ్రియ హీరోయిన్ కాగా, తొలి ప్రేమ మూవీతో పవన్ కళ్యాణ్ సరసన ప్రియురాలిగా నటించిన కీర్తి రెడ్డి.. ఈ చిత్రంలో మహేష్ బాబుకు అక్కగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఏ సినిమాల్లో నటించలేదు. రాజా, ప్రకాష్ రాజ్, సరిత, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మహేష్ బాబు సోదరుడు రమేష్ నిర్మించారు. 16 ఏళ్ల తర్వాత ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ సరిత.

ఈ మూవీ కోసం మధుర మీనాక్షి ఆలయాన్ని భారీ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి నంది అవార్డు వరించింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. పాటలు కూడా మంచి హిట్ కొట్టాయి. తన కవల అక్కను కాపాడుకునే సోదరుడిగా అర్జున్ పాత్రలో మెరిశాడు మహేష్ బాబు. ఇక ఇందులో శ్రియ తండ్రి మాట జవదాటని కూతురుగా కనిపిస్తుంది. ఇందులో ఓ ఫన్నీ సన్నివేశం ఉంటుంది. తన లవ్ గురించి తండ్రికి చెప్పేందుకు ప్రిపేర్ చేస్తుంది శ్రియ. అంతలో ఓ బుడ్డోడు.. వచ్చి ‘గీత.. గీత.. రా గీత.. వచ్చేయ్.. నా ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. పవిత్రమైన ప్రేమకున్న పవర్.. ఈ ప్రపంచంలో దేనికీ లేదు. నీ కోసం.. నీ ప్రేమ కోసం చావడానికైనా.. చంపడానికైనా సిద్ధంగా ఉన్న గీత.ఈ పెద్దళ్లున్నారే ఈ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు’ అంటూ కొన్ని డైలాగ్స్ టక టక చెప్పేస్తాడు.

అంతలో స్కూల్ డ్రెస్సులో ఉన్న గీత.. ఆ అబ్బాయి దగ్గరకి వచ్చి ఫట్ అని చెంపమీద పీకుతుంది. ‘ఈ చెత్తను తీసుకెళ్లి చెత్త కుప్పలో వేయండి’అని చెబుతుంది. ఇంతకు ఆ సీనులో నటించిన ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో తెలుసా.. ఒకరు మానస్.. మరొకరు లహరి. మానస్ చిన్నప్పుడు అర్జున్ మూవీ నటించారని తెలుసు కానీ.. లహరి గురించి పెద్దగా తెలియదు. అందులో గీత పాత్రలో..శ్రియా చెల్లెలిగా నటించింది మరెవ్వరో కాదు బుల్లితెర స్టార్ నటి లహరి. చక్రవాకం, మొగలి రేకులు, ముద్దు బిడ్డ, రాధ-మధు, గృహలక్ష్మి, కళ్యాణ తిలకం వంటి సీరియల్స్‌లో ఫేమస్ అయ్యింది. 25 సీరియల్స్ పైగా నటించింది. అయితే చిన్నప్పటి నుండే ఆమె పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ల్ఫయెన్సర్స్‌గా రాణిస్తోంది లహరి. ఆమెను బుల్లితెర సౌందర్య అని పిలిచేవారని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss