iDreamPost
android-app
ios-app

‘స్కంద’లో రామ్ చెల్లెలి రోల్ చేసింది ఎవరో తెలుసా? సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్!

‘స్కంద’లో రామ్ చెల్లెలి రోల్ చేసింది ఎవరో తెలుసా? సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్!

ఈ మధ్య సినిమాల్లో హీరోకి చెల్లిగా, హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్లలో తళుక్కున మెరిసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు కొందరు యాక్టర్స్. నటించిన మొదటి సినిమాలోనే మెప్పించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ మధ్య వచ్చిన బేబీ మూవీలో హీరోయిన్ కు ఫ్రెండ్ గా చేసిన కుసుమ డేగల మారి బస్తీ అమ్మాయిగా సాదా సీదాగా కనిపిస్తూ అలరించింది. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమాలో హీరో రామ్ పోతినేనికి చెల్లెలిగా నటించిన ఓ నటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎవరబ్బా ఈ అమ్మాయి అంటూ తెగ వెతికేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే?

రామ్ పోతినేని, శ్రీలీలా జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ స్కంద సెప్టెంబర్ 28న విడుదలైన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు సినిమా ఆకట్టుకోలేకపోయిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా స్కంద సినిమాలో రామ్ పోతినేనికి చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు తెలుగింటి అమ్మాయి భీమవరంకు చెందిన అమృతా చౌదరి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ఇదివరకే షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లో నటించింది. సోషల్ మీడియాలో కూడా ఆక్టీవ్ గా ఉంటూ హాట్ ఫోటోస్, వీడియోలను అప్ లోడ్ చేస్తూ పిచ్చ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అమృత చౌదరిని ఇన్ స్టాలో సుమారు ఏడు లక్షల మంది ఫాలోఅవుతున్నారంటే యూత్ లో ఈ అమ్మడు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో వేరే చెప్పక్కర్లేదు. మతి పోగెట్టే అందంతో అమృతా కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం కావడంతో హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజన్స్ పొగిడేస్తున్నారు. స్కంద రిజల్ట్ తో సంబంధం లేకుండా అమృతకు సినీ అవకాశాలు క్యూకట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. హీరోయిన్ గా అవకాశం వస్తే గనక ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by AMRUTHA CHOWDARY✨ (@__amrutha__chowdary__)

 

View this post on Instagram

 

A post shared by AMRUTHA CHOWDARY✨ (@__amrutha__chowdary__)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి