ఇంద్ర సినిమాలో చాలా మందికి తెలియని ఓ నిజం! ఇన్నాళ్ళకి బయటకి!

Chiranjeevi, Indra Movie: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ఇంద్ర మూవీ గురించి అందరీకి తెలిసిందే. అయితే ఈ మూవీ నేడు చిరు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో చాలామందికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇంతకీ అదేమిటో తెలుసా

Chiranjeevi, Indra Movie: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ఇంద్ర మూవీ గురించి అందరీకి తెలిసిందే. అయితే ఈ మూవీ నేడు చిరు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో చాలామందికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇంతకీ అదేమిటో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు, ఈయన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బాస్ ఆఫ్ మాసెస్ గా చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన ఈమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎలాంటి సినీ నేపథత్యం లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈయన దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న రారాజుగా ఎదిగారు. ఇక ఇండస్ట్రీలో ఈయన ఎంతోమందికి స్పూర్తి. ఇదిలా ఉంటే.. నేడు చిరు పుట్టినరోజు కావడం వేశేషం. ఈ సందర్భంగా నేడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు బర్త్ డే కానుకగా ఆయన ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు.. మెగాస్టార్ సెన్సేషనల్ హిట్ మూవీ ‘ఇంద్ర’ కూడా రీ రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం హంగామా థియేటర్స్ లో ఏ రేంజ్ లో ఉందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా ఇంద్ర సినిమా రిరీలిజ్ కావడంతో.. చిరు అభిమానులు మళ్లీ 22 ఏళ్ల వెనక్కి వెళ్లపోతున్నారు. ఇక ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అంతేకాకుండా.. అప్పటిలో తెలుగు సినిమా రికార్డులు తిరగరాసిన సినిమాగా ఇంద్ర నిలిచింది. అయితే ఈ సినిమా 2002 జులై 22న విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ఇక ఆ సినిమాలో ఒక్కో డైలాగ్ వేరే లెవల్ అనే చెప్పవచ్చు. మరీ అంతటి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఈ ినిమా నేడు చిరు బర్త్ డే సందర్భంగా.. రీ రిలిజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో చాలామందికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇంతకీ అదేమిటంటే..

చిరంజీవి ఇంద్ర సినిమాకు బి గోపాల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కానీ, ఇంద్ర సినిమాలో మోస్ట్ పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తాన్ని చిరంజీవే తెరకెక్కించారని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తాన్ని అప్పటిలో బి గోపాల్ దర్శకత్వం చేయలేదట. చిరునే ఈ మొత్తాం ఎపిసోడ్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించరట. అయితే అప్పట్లో బి గోపాల్ ప్రభాస్ అడవి రాముడు షూటింగ్ కూడా చేయాల్సి ఉన్న సందర్భంగా మెగాస్టార్ ఇంద్ర దర్శకత్వ భాద్యతలు తీసుకున్నారట. అలా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తాన్ని చిరు నటిస్తూనే దర్శకత్వం వహించారట. ఇది మాత్రం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాలి బ్రిందే, ఆర్తి ఆగర్వాల్ నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.

Show comments