iDreamPost
android-app
ios-app

హీరోయిన్ అవ్వకముందే కంగనాకి ఫ్రెండ్ గా సాయిపల్లవి! ఏ సినిమాలో తెలుసా?

  • Author ajaykrishna Published - 10:15 AM, Sat - 5 August 23
  • Author ajaykrishna Published - 10:15 AM, Sat - 5 August 23
హీరోయిన్ అవ్వకముందే కంగనాకి ఫ్రెండ్ గా సాయిపల్లవి! ఏ సినిమాలో తెలుసా?

సాయిపల్లవి.. సౌత్ ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. లేడీ పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సాయిపల్లవి అనగానే అందరికీ మలయాళం సూపర్ హిట్ ప్రేమమ్ మూవీ గుర్తొస్తుంది. తెలుగులో ఫిదాతో పాటు చాలా సినిమాలు గుర్తొస్తాయి అది వేరే విషయం. హీరోయిన్ గా సూపర్ స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ భామ.. తాను చేసిన ప్రతీ సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ వెళ్తోంది. నటిగా ముందునుండి ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ.. ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా తెలుగులో సాయిపల్లవి ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు.

అలాంటి సాయిపల్లవి.. హీరోయిన్ గా డెబ్యూ చేయకముందు వేరే సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిందని ఎంతమందికి తెలుసు? అవును.. నిజంగానే ఈ బ్యూటీ ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో కాదు కంగనా రనౌత్. అదేంటీ.. కంగనాకి ఫ్రెండ్ గా సాయిపల్లవి నటించిందా? అనే సందేహం మీకు రావచ్చు. ఇప్పుడు అదే వివరాల్లోకి వెళ్దాం. కంగనా తమిళంలో హీరోయిన్ గా ‘ధామ్ ధూమ్’ అనే మూవీతో డెబ్యూ చేసింది. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా.. తెలుగులో రక్షకుడు పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలో కంగనాకు స్నేహితురాలిగా సాయిపల్లవి మెరిసింది.

ఇక ఈ సినిమాలో సాయిపల్లవి.. కంగనాతో కలిసి సినిమా థియేటర్ కి వెళ్లే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో యంగ్ సాయిపల్లవిని క్లియర్ గా గమనించవచ్చు. ప్రస్తుతం సాయిపల్లవికి సంబంధించి ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే.. హీరోయిన్ కాకముందే సాయిపల్లవి డాన్సర్ గా పలు షోలలో పార్టిసిపేట్ చేసింది. పాపులర్ డాన్స్ షో ఢీలో కూడా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను రక్షకుడు సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత స్టడీస్ కంప్లీట్ చేశాక.. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. అలా తెలుగులో ఫిదా, ఎంసిఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం సినిమాలతో నటిగా స్టార్డమ్ సొంతం చేసుకుంది. మరి సాయిపల్లవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss