iDreamPost
android-app
ios-app

పాపను గుర్తుపట్టారా? హీరోయిన్ గా త్వరలో పాన్ ఇండియాని షేక్ చేయబోతుంది!

  • Author ajaykrishna Published - 03:27 PM, Sat - 22 July 23
  • Author ajaykrishna Published - 03:27 PM, Sat - 22 July 23
పాపను గుర్తుపట్టారా? హీరోయిన్ గా త్వరలో పాన్ ఇండియాని షేక్ చేయబోతుంది!

చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ప్రారంభించిన చాలామంది సినీతారలు.. పెద్దయ్యాక హీరోయిన్స్ అవుతారో లేదో చెప్పలేం. కానీ.. ఏదో ఒక విధంగా సినిమాలలో అయితే కనిపిస్తుంటారు. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప.. చాలా టాలెంటెడ్. చిన్నప్పుడు సినిమాలలో ఎంట్రీ ఇచ్చినప్పటికి.. మ్యూజిక్ మీద ఇంటరెస్ట్ తో నేర్చుకొని సింగర్ గా మారింది. పెద్దయ్యాక హీరోయిన్ గా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించింది. కట్ చేస్తే.. కొన్నాళ్ళకు టాలీవుడ్ డెబ్యూ చేసింది. ఫస్ట్ సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదు గాని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇంకేముంది.. సెకండ్ మూవీనే బ్లాక్ బస్టర్. అంతే.. మిగతా హీరోలంతా అవకాశాలు ఇచ్చేశారు.

కట్ చేస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీ కావాలని అనుకున్న బ్యూటీ హీరోయిన్ గా సూపర్ బిజీ. హిట్స్ మీద హిట్స్ పడ్డాయి. కానీ.. సింగింగ్ ని వదలలేదు. ఈ క్రమంలో తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ సక్సెస్ అయ్యిందా లేదా పక్కన పెడితే.. తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది. కానీ.. కొన్నాళ్ళకు ఇండస్ట్రీ నుండి సడన్ గా బ్రేక్ తీసుకుంది. ఎవరో గుర్తు వచ్చిందా..? సినిమాలు ఆపేసాక.. ఇదిగో ఇతనే నా బాయ్ ఫ్రెండ్ ఇతన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించేసింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా మ్యూజిషియన్ కావడం విశేషం. ఓకే.. మీకు ఈ బ్యూటీ ఎవరో తెలిసిపోయిందా..

ఈ గ్లామర్ బ్యూటీకి సినీ బ్యాక్ గ్రౌండ్ గట్టిగానే ఉంది. కానీ.. తన పేరెంట్స్ పేరు చెప్పుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ఎవరో కాదు శృతిహాసన్.. డాటర్ ఆఫ్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగని ఈమె గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరిగిన శృతి.. ఓవైపు మ్యూజిషియన్ గా, మరోవైపు స్టార్ హీరోయిన్ గా కెరీర్ ని బాలన్స్ చేస్తోంది. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సరసన సలార్ మూవీ చేసింది. ఆ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. కాగా.. ప్రెజెంట్ శృతి చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పాప గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş